రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సినిమా స్కంద. ఎన్నో అంచనాల మధ్య ఇవాళ ఈ సినిమా రిలీజ్ అయ్యింది. సినిమా కొంత మంది బాగుంది అంటే, మరి కొంత మంది మాత్రం రొటీన్ కమర్షియల్ సినిమా లాగా ఉంది అని అంటున్నారు.

Video Advertisement

సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నుండి ఇలాంటి రెస్పాన్స్ వస్తూనే ఉంది. బోయపాటి శ్రీను సినిమాలు అన్నీ కలిపి మిక్సీలో వేసి తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా ఎలా ఉంది అని చెప్పారు.

trending memes on skanda release

పేరుకి ట్విస్ట్ అని ఒక సీన్ పెట్టినా కూడా అది పెద్ద కొత్తగా ఏమీ అనిపించలేదు అని అన్నారు. ఈ మధ్య వస్తున్న ప్రతి సినిమాకి తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో హైలైట్ అవుతున్న తమన్ ఈ సినిమాకి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా రొటీన్ గా ఉంది అన్నారు. అలాంటి మ్యూజిక్, అలాంటి పాటలు విని విని అలవాటు అయిపోయింది అని, ఇప్పుడు మార్చాలి అని అన్నారు.

సినిమా కోసం రామ్ తనని తాను మార్చుకున్న తీరు బాగున్నా కూడా, సినిమా టేకింగ్ పరంగా చాలా లోపించింది కాబట్టి సినిమా రెస్పాన్స్ ఇలా వస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలో కూడా రిలీజ్ అయ్యింది. సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్ కూడా మోతాదుకి మించి ఉన్నాయి అని చెప్పారు. ఈ సినిమా రిలీజ్ మీద సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

1. 2.
3.
4.
5.
6. 7. 8. 9.10.
11. 12. 13. 14. 15. 16.17.
18.Also Read: SKANDA REVIEW : “రామ్ పోతినేని” ఈ సినిమాతో హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!