Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షెడ్యూల్ ఇటీవల గోవాలో ముగిసింది. ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ తో మహేష్ బాబు కనిపించబోతున్నారు. ప్రస్తుతం సినిమా బృందం అంతా స్పెయిన్ లో షూటింగ్ లో ఉంది. ఈ సినిమాకి గీతగోవిందం సినిమాకి దర్శకత్వం వహించిన పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్ మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా నటిస్తున్నారు. దూకుడు, బిజినెస్ మాన్, ఆగడు తర్వాత మళ్లీ తమన్ మహేష్ బాబుతో కలిసి సర్కారు వారి పాట సినిమాకి పని చేయబోతున్నారు.
Video Advertisement
ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే పాటలు కంపోజ్ చేయడం అయిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా తమన్ సోషల్ మీడియాలో చెప్పారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మహేష్ బాబుతో కలిసి ఉన్న ఒక ఫోటోని పోస్ట్ చేశారు. అందులో తమన్ వేసుకున్న షర్ట్ ఇటీవల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సక్సెస్ పార్టీ కి అల్లు అర్జున్ వేసుకున్న షర్ట్ లాగా ఉంది. అయితే, అంతకు ముందు భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ వీడియోలో కూడా తమన్ ఇదే షర్ట్ వేసుకొని ఉన్నారు. దాంతో, “ఇద్దరూ కలిసి ఒకటే షర్ట్ కొన్నారా?” అంటూ సోషల్ మీడియాలో ఇలా మీమ్స్ వస్తున్నాయి.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
End of Article