Ads
ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వైష్ణవ్ తేజ్ ఇప్పుడు మరొక సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో రాబోతున్న ఈ సినిమా టైటిల్ ఇవాళ విడుదల చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కొండ పొలం అనే పేరు పెట్టారు. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి గారు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఉప్పెన సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే ఎంతో పేరు సంపాదించారు. ఈ సినిమాకి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు.
Video Advertisement
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కూడా ఈ సినిమాకి ఒక మేజర్ హైలైట్ అయింది. అయితే ఈ కొండ పొలం సినిమా ఎప్పుడు మొదలయ్యింది. షూటింగ్ కూడా చాలా కాలం క్రితమే అయిపోయింది. ఉప్పెన సినిమా ప్రమోషన్ సమయంలోనే కొండాపురం సినిమా డబ్బింగ్ కూడా అయిపోయింది అని వైష్ణవ్ తేజ్ చెప్పారు. అంటే షూటింగ్ అంత ఫాస్ట్ గా చేసేసారు అన్నమాట. ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది.
ఇందులో కటారు రవీంద్ర యాదవ్ పాత్రలో వైష్ణవ్ తేజ్, ఓబులమ్మ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. ఈ సినిమాలో సీనియర్ నటుడు సాయిచంద్ గారు, నాజర్ గారు, కోట శ్రీనివాసరావు గారు, అన్నపూర్ణ గారు, హేమ, రవి ప్రకాష్, మహేష్ విట్ట, రచ్చ రవి, ఆనంద్ విహారి ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఉప్పెన అన్ సీన్ పోస్టర్ లాగా ఉంది అంటూ ఇలా మీమ్స్ కూడా వస్తున్నాయి.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
End of Article