Ads
కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి కూడా డిఫరెంట్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు వెంకటేష్. తన పాత్ర హైలెట్ అవ్వాలి అని ఆలోచించకుండా మంచి కథ ఉంటే ఎలాంటి పాత్ర అయినా సరే చేయడానికి సిద్ధపడే నటుల్లో ఒకరు వెంకటేష్. ఆ పాత్ర నెగిటివ్ పాత్ర అయినా, పాజిటివ్ పాత్ర అయినా, కామెడీ పాత్ర అయినా, సెంటిమెంట్ పాత్ర అయినా ఎలాంటి పాత్ర అయినా సరే వెంకటేష్ చేస్తారు.
Video Advertisement
అలా ఎన్నో మంచి కథలని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు వెంకటేష్. అంతే కాకుండా వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాల్లో కూడా చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. మహేష్ బాబుతో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించారు. పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల సినిమాలో నటించారు. అలాగే కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలో కూడా కనిపించారు.
గత కొంత కాలం నుండి వెంకటేష్ కేవలం హీరో అంటే ఇలాగే ఉండాలి అని ఉన్న ఒక మార్క్ కూడా పోగొట్టడానికి ఇంకా డిఫరెంట్ పాత్రలు చేస్తున్నారు. దృశ్యం, నారప్ప ఈ రెండు సినిమాల్లో వెంకటేష్ హీరో. కానీ అందులో వెంకటేష్ ఒక మధ్య వయస్కుడిగా, పిల్లల తండ్రిగా కనిపించారు.
అలా హీరో అంటే ఇలా మాత్రమే ఉండాలి అనే ఒక ఆలోచన కూడా వెంకటేష్ పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు వెంకటేష్ రానా దగ్గుబాటితో కలిసి రానా నాయుడు అనే నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో నటించారు. ఇందులో వీరిద్దరూ తండ్రీకొడుకులుగా నటించారు. ఈ టీజర్ ఇవాళ విడుదల అయ్యింది. ఇందులో వెంకటేష్ గెటప్ చాలా డిఫరెంట్ గా ఉంది. అలాగే రానా కూడా ఒక డిఫరెంట్ పాత్రలో కనిపిస్తున్నారు. వీరు మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది ప్రముఖ నటులు ఈ టీజర్ లో కనిపిస్తున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16
End of Article