Ads
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ట్రైలర్ ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమాకి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. పూరి కనెక్ట్స్ తో కలిసి కరణ్ జోహార్ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అవుతోంది. ట్రైలర్ చూస్తూ ఉంటే హీరో ఒక ఎంఎంఏ ఫైటర్ పాత్రలో నటిస్తున్నారు అని అర్థమవుతోంది. ఇందులో రమ్య కృష్ణ హీరో తల్లి పాత్రలో నటిస్తున్నారు.
Video Advertisement
ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కూడా చాలా కారణాలవల్ల ఆలస్యం అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ట్రైలర్ లో చాలా మంది ప్రముఖ నటీనటులు కనిపించారు. అంతే కాకుండా బ్యాక్ గ్రౌండ్ లో ఒక పాట కూడా వినిపిస్తోంది. ట్రైలర్ మొత్తం ఈ పాట వస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల అయ్యాయి.
ఇప్పుడు ఈ సినిమా ఈ భాషలతో పాటు హిందీలో కూడా విడుదల అవుతోంది. ఇంకా కొన్ని రోజుల్లో విజయ్ దేవరకొండ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటారు. ఈ సినిమా ట్రైలర్ లో విజయ్ దేవరకొండ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఈ పాత్ర కోసం విజయ్ దేవరకొండ చాలా కష్టపడ్డారు అని అర్థమవుతోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి నత్తి అని కూడా తెలుస్తోంది. సినిమా అంత ముంబై నేపథ్యంలోనే సాగుతుంది. ఈ ట్రైలర్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
End of Article