Ads
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇవాళ తన 50వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు, అలాగే ఎంతో మంది సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ కి బర్త్ డే విషెస్ అందిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ రాబోయే సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా అయినా భీమ్ల నాయక్ సినిమాలోని టైటిల్ సాంగ్ ఇవాళ విడుదల చేశారు. ఈ పాటని తమన్ స్వరపరిచారు. పృథ్వి చంద్ర, శ్రీకృష్ణ, రామ్ మిరియాల పాడారు.
Video Advertisement
ఈ పాటలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో పాటు సింగర్స్ కూడా కనిపించడం విశేషం. అయితే పాట స్పీడ్ ఇంకా పెంచితే బాగుండేది అని చాలా కామెంట్స్ వస్తున్నాయి. పాట బాగున్నా కూడా కొంచెం స్లోగా ఉంది అని అంటున్నారు. కానీ యూట్యూబ్ లో మనం స్పీడ్ పెంచుకొని వినడానికి ఆప్షన్ ఉంది కాబట్టి చాలా మంది 1.25 x స్పీడ్ లో వినండి బావుంది అని కామెంట్స్ కూడా పెడుతున్నారు. నిజంగానే అలా వింటే పాట మాత్రం ఒక రేంజ్ లో ఉంది అంటూ ఆ కామెంట్స్ కి రిప్లై కూడా ఇస్తున్నారు నెటిజన్లు. ఇదే అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఇలా మీమ్స్ రూపంలో వ్యక్తపరుస్తున్నారు.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
End of Article