“ఏదో షాపింగ్ మాల్ యాడ్ లాగా ఉంది ఏంటి..?” అంటూ… చిరంజీవి “భోళా శంకర్” కొత్త పోస్టర్‌పై 15 ట్రోల్స్..!

“ఏదో షాపింగ్ మాల్ యాడ్ లాగా ఉంది ఏంటి..?” అంటూ… చిరంజీవి “భోళా శంకర్” కొత్త పోస్టర్‌పై 15 ట్రోల్స్..!

by Mohana Priya

Ads

ఈ సంవత్సరం మొదట్లో వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ కొట్టారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి నటించిన గత రెండు సినిమాలు కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వగా గాడ్ ఫాదర్ సినిమా యావరేజ్ గా నిలిచింది.

Video Advertisement

సినిమా బాగున్నా కూడా చిరంజీవి మార్క్ సినిమా ఇది కాదు అని అన్నారు. దాంతో వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి రేంజ్ ఏంటో మళ్లీ చూపించారు. దాంతో చాలా మంది ఈ సినిమా చూసిన తర్వాత, “చిరంజీవిని ఇలాగే కదా మనం చూడాలి అనుకున్నాము” అని అన్నారు.

ఇప్పుడు చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమా రీమేక్. ఇందులో చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. హీరోయిన్ గా తమన్నా నటిస్తున్నారు. షూటింగ్ జరుగుతోంది. అంతే కాకుండా హీరో సుశాంత్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా రీమేక్ సినిమా అయినా కూడా చిరంజీవి నటిస్తున్నారు కాబట్టి సినిమా ఎలా ఉండబోతోంది అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Trending trolls on chiranjeevi bhola shankar ugadi special poster

అలాగే ఈ సినిమాలో చిరంజీవి పవన్ కళ్యాణ్ అభిమానిగా నటిస్తున్నారు అని, ప్రముఖ యాంకర్ శ్రీముఖి కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు అనే వార్తలు వచ్చాయి. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఖుషి సినిమాలోని సీన్ ఈ సినిమా కోసం మళ్ళీ క్రియేట్ చేస్తున్నారు అనే వార్త కూడా వచ్చింది. ఉగాది సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ఒకటి విడుదల చేశారు. ఇందులో చిరంజీవితో పాటు కీర్తి సురేష్, తమన్నా కూడా ఉన్నారు. పోస్టర్ బాగానే ఉన్నా కూడా చాలా కామెంట్స్ వస్తున్నాయి. చాలా మంది ఇది చూసి ఏదో షాపింగ్ మాల్ అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18


End of Article

You may also like