Ads
ఈ సంవత్సరం విడుదలయ్యే సినిమాలలో అందరూ ఎక్కువగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి కేజీఎఫ్ 2. ఈ సినిమా 2018 లో విడుదలైన కేజీఎఫ్ కి కొనసాగింపు. కానీ సెకండ్ పార్ట్ లో రావు రమేష్, బాలీవుడ్ స్టార్లు రవీనా టాండన్, సంజయ్ దత్, అలాగే ఈశ్వరీ రావు కూడా కనిపిస్తున్నారు. వీరిలో రవీనా టాండన్ రమికా సేన్ గా నటిస్తుండగా, నెగిటివ్ పాత్ర అయిన అధీరా గా సంజయ్ దత్ నటిస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు.
Video Advertisement
మొదటి పార్ట్ లో ఉన్న ఫేమస్ డైలాగ్ “పవర్ ఫుల్ పీపుల్ కం ఫ్రమ్ పవర్ ఫుల్ ప్లేసెస్” అనే డైలాగ్ టీజర్ లో కూడా వినిపిస్తుంది. కానీ దీనికి ఎడిషన్ గా “అది తప్పు అని, పవర్ ఫుల్ ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ ఫుల్” అనే డైలాగ్ కూడా ఉంది. వాయిస్ ఓవర్ లో ఉన్న గొంతు ప్రకాష్ రాజ్ గొంతు లాగా అనిపిస్తుంది. అయితే, ప్రతి భాషకు సపరేట్ గా కాకుండా అన్ని భాషలకు కలిపి ఇంగ్లీష్ లో టీజర్ విడుదల చేశారు.
అయితే అన్నీ బావుంటే కేజిఎఫ్ 2 జూలై 16 వ తేదీన విడుదల అవ్వాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది. ఈ సినిమా అక్టోబర్ లో గాని లేదా ఈ ఏడాది చివరిలో కానీ విడుదల చేస్తారు అనే వార్తలు వస్తున్నాయి. కానీ ఒకవేళ నిజంగానే ముందు అనుకున్నట్టుగా జూలై 16వ తేదీన ఈ సినిమా విడుదల అయ్యి ఉంటే సెలబ్రేషన్ ఏ రేంజ్ లో ఉండేదో అంటూ ఇలా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
End of Article