Ads
ఒక సినిమా హిట్ అవ్వాలంటే సినిమాలో అన్ని ఎలిమెంట్స్ కరెక్ట్ గా ఉండాలి. కథ, పర్ఫామెన్స్, ఫైట్స్, డైలాగ్స్ తో పాటు ఒక సినిమాకి మ్యూజిక్ కూడా ఎంతో ఇంపార్టెంట్. ఏదైనా ఒక సినిమా హిట్ అయిన తర్వాత మహా అయితే కొన్ని సంవత్సరాలు మాత్రమే ఈ సినిమాని గుర్తుంచుకుంటారు. తర్వాత ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడతారు. కానీ ఆ సినిమాలో పాటలు మాత్రం ఎన్ని సంవత్సరాలు అయినా సరే వినిపిస్తూనే ఉంటాయి.
Video Advertisement
ఈ జాబితాకు చెందిన మరోకా పాట సారంగ దరియా. నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ సినిమాలోని సారంగ దరియా పాట లిరికల్ వీడియో ఫిబ్రవరి 28వ తేదీన విడుదల అయ్యింది. ఈ సినిమాకి పవన్ సిహెచ్ సంగీతం అందించారు. పాట చాలా క్యాచీగా ఉండటంతో, ట్యూన్ ఇంకా లిరికల్ వీడియోలో కనిపించిన స్టెప్స్ ప్రేక్షకులని ఆకర్షించాయి. దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ ఒక్క పాట మాత్రమే కాకుండా ఈ సినిమా నుండి విడుదలైన మిగిలిన పాటలు కూడా విడుదలకు ముందే సూపర్ హిట్ అయ్యాయి. మామూలుగా అయితే లవ్ స్టోరీ సినిమా ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. అయితే ఇవాళ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. లవ్ స్టోరీ సినిమా వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10వ తేదిన విడుదల అవ్వబోతోంది. అయితే ఈ పోస్టర్ లో వినాయక చవితి బదులు వినకాయ చవితి అని రాశారు. దాంతో సోషల్ మీడియాలో ఈ పోస్టర్ పై ఈ విధంగా ట్రోల్స్ మొదలయ్యాయి.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
End of Article