Ads
ప్రస్తుతం భారతదేశంలో చర్చలో ఉన్న విషయాల్లో ఒకటి పెట్రోల్ ధరలు. మెల్లగా పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర 100 దాటింది. ఇటీవల భోపాల్ లో ప్రీమియం పెట్రోల్ ధర ₹100 దాటడంతో ఒక వ్యక్తి పెట్రోల్ బంక్ దగ్గర ఒక చేత్తో బ్యాట్, మరొక చేత్తో హెల్మెట్ పట్టుకుని నిలబడ్డాడు. ఆ ఫోటో పెట్రోల్ ధర సెంచరీ కొట్టింది అని సంకేతం ఇస్తున్నట్లుగా ఉంది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Video Advertisement
ఇది మాత్రమే కాదు పెట్రోల్ ధరలకు సంబంధించిన ప్రతి విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో సరదాగా, సీరియస్ గా వైరల్ అవుతున్నాయి. కరోనా తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలపై ఉన్న టాక్స్ పెరిగింది. ఏప్రిల్ 1, 2020 అంటే లాక్ డౌన్ మొదట్లో ఉన్నప్పుడు పెట్రోల్ ధర పై 37.8 రూపాయలు, డీజిల్ ధర పై 28 రూపాయల టాక్స్ ఉండేది. ఫిబ్రవరి 1, 2021 కి వచ్చేసరికి పెట్రోల్ పై టాక్స్ 52.9, డీజిల్ పై టాక్స్ 43.1 రూపాయలకి పెరిగింది.
ప్రతి ప్రాంతానికి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు వేరేగా ఉంటాయి. ఆ రాష్ట్ర గవర్నమెంట్ విధించే వాట్ వల్ల ధరలు మారుతాయి. అయితే, ఈ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల మీద సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్, ట్రోల్స్ వస్తున్నాయి. అందులో కొన్ని ఇవే.
#1
#2#3#4#5#6#7#8#9#10
End of Article