Ads
ప్రస్తుతం పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది.
Video Advertisement
దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు. అయితే, పుష్ప సినిమా టాక్ మాత్రం మిక్స్డ్ గానే వస్తోంది. పుష్ప సినిమా థియేటర్లలో నడుస్తుండగానే అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.
హిందీ వెర్షన్ తప్ప మిగిలిన అన్ని భాషల్లో సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. థియేటర్లో చూసినప్పుడు సినిమాకి సంబంధించిన చాలా పొరపాట్లు మనకి అంత పెద్దగా కనిపించవు. అదే సినిమాని టీవీలో చూసినప్పుడు కానీ, లేదా థియేటర్లలోనే ఒకటి గంటలకు సార్లు చూసినప్పుడు కానీ మనం గమనిస్తూ ఉంటాం. అలా పుష్పకి సంబంధించిన ఒక పొరపాటు కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ సినిమా ఎండ్ క్రెడిట్స్ లో సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించిన నటీనటుల పేర్లు పడతాయి.
ఇందులో హీరోయిన్ రష్మిక మందన్న పేరు కూడా కనిపిస్తుంది. కానీ రష్మిక పేరు తప్పుగా పడింది. పేర్లు అన్నీ ఇంగ్లీష్ లో వస్తాయి. రష్మిక మందన్న అంటే Rashmika Mandanna అని రావాలి. కానీ సినిమాలో మాత్రం చివరికి Rasmika Madona అని వచ్చింది. సినిమాలో వచ్చిన పేరు చదివితే రస్మిక మడోనా అని వస్తుంది. దాంతో ఇంత పెద్ద సినిమాలు పేర్లలో ఇలాంటి తప్పులు వస్తే చూసుకోరా అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
#1
#2
#3
#4
#5
#6
End of Article