Ads
ప్రస్తుతం వరుస సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. రాధే శ్యామ్‌తో పాటు ఆదిపురుష్, సలార్ సినిమాల షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ భారతదేశం అంతటా వ్యాపించింది. బహుశా ప్రభాస్ తెలియని ఇండస్ట్రీ ఉండదేమో.
Video Advertisement
అందుకే బాహుబలి తర్వాత వచ్చిన సాహో కూడా తెలుగుతోపాటు ఇతర భాషల్లో కూడా విడుదల అయ్యింది. ఇప్పుడు రాబోతున్న సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలుగా విడుదల అవుతున్నాయి. ప్రభాస్ హీరోగా రాబోతున్న సినిమాల్లో ఒకటి సలార్. ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇవాళ శృతి హాసన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సాలార్ సినిమా బృందం శృతిహాసన్ కి బర్త్ డే విషెస్ తెలుపుతూ ఒక పోస్టర్ విడుదల చేశారు.
ఇందులో శృతి హాసన్ పేరు ఆద్య అని కూడా ఈ పోస్టర్ ద్వారా చెప్పారు. పోస్టర్ లో శృతి హాసన్ ఒక బొగ్గు గని దగ్గర కూర్చొని ఉంటారు. అంతకుముందు ప్రభాస్ అలాగే జగపతి బాబు పోస్టర్స్ విడుదల చేశారు. వారిద్దరి పోస్టర్స్ లో కూడా వారి మీద బొగ్గు పూసినట్టు చూపించారు. దాంతో “అసలు ఈ ప్రశాంత్ నీల్ కి బొగ్గు అంటే ఎందుకు అంత ఇష్టం?” అంటూ ఇలా మీమ్స్ వస్తున్నాయి.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
End of Article