Ads
విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా ఫస్ట్ లుక్ ఇవాళ విడుదలైంది. ఈ సినిమాకి లైగర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. లైగర్ కి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి తెలుగులో సినిమా నిర్మించగా, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హిందీలో కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా సినిమాగా విడుదల అవ్వబోతోంది. అనన్య పాండే ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు.
Video Advertisement
ఇందులో రమ్యకృష్ణ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ పాత్రలో నటిస్తారు అనే వార్త ప్రచారంలో ఉంది. అదే నిజం అని ఇవాళ విడుదల చేసిన పోస్టర్ తో రుజువైంది. లైగర్ కోసం విజయ్ దేవరకొండ చాలా కష్టపడ్డారు. మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకోవడంతో పాటు ఫిట్ నెస్ మీద కూడా ఇంకా ఎక్కువగా శ్రద్ధ పెట్టారు.
సినిమాకి సంబంధించిన ట్రైనింగ్ ప్రాసెస్ గురించి కొన్ని విషయాలను విజయ్ దేవరకొండ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ ల ద్వారా మనకు చెప్తూ ఉంటారు. అయితే, ఇవాళ విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా మందిని ఆకట్టుకుంది. టైటిల్, విజయ్ దేవరకొండ లుక్ కూడా డిఫరెంట్ గా ఉండడంతో ఈ సినిమా ప్రేక్షకుల్లో ఇంకా ఆసక్తిని క్రియేట్ చేసింది. ఇవాళ లైగర్ ఫస్ట్ లుక్ విడుదల అవ్వడం, అది కూడా పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఇలా మీమ్స్ మొదలయ్యాయి.
#1
#2 #3 #4 #5 #6
#7 #8 #9 #10 #11 #12 #13#14
End of Article