పవిత్ర జయరాం పోస్ట్ చేసిన చివరి వీడియో..! “ఊపిరి ఒకటే..!” అంటూ..?

పవిత్ర జయరాం పోస్ట్ చేసిన చివరి వీడియో..! “ఊపిరి ఒకటే..!” అంటూ..?

by Mohana Priya

Ads

సీరియల్ నటి పవిత్ర జయరాం తెలియని తెలుగువారు ఉండరు. తినయని అనే సీరియల్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ సీరియల్ లో తిలోత్తమ అనే పాత్రలో పవిత్ర నటించారు. విలన్ పాత్రలో ఈ సీరియల్ లో పవిత్ర నటించారు. తిలోత్తమ పేరుతోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అదే పేరుతో పిలిచి పవిత్రని గుర్తుపట్టేవారు. సీరియల్ లో అలాంటి పాత్ర పోషించినా కూడా పవిత్ర బయట చాలా సరదాగా ఉండే మనిషి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా సీరియల్ నటులు అందరితో కలిసి ఉన్న ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటారు.

Video Advertisement

trinayani actress pavitra jayaram last video

పవిత్ర కన్నడ వారు. కానీ తెలుగు సీరియల్స్ లో నటించి తెలుగు నటి అయిపోయారు. తెలుగులో నిన్నే పెళ్ళాడుతా అనే సీరియల్ లో పవిత్ర మొదటిసారిగా నటించారు. అయితే పవిత్ర ఇటీవల తన చివరి శ్వాస విడిచారు. ఎంతో మంది తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పవిత్ర చనిపోయే కొద్ది రోజుల ముందు సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ షేర్ చేశారు. అందులో పవిత్ర, సీరియల్ లో తన సోదరుడిగా నటించిన చంద్రకాంత్ గురించి కొన్ని రీల్స్ చేశారు. చంద్రకాంత్, పవిత్ర ప్రేమలో ఉన్నారు అని ఇవి చూస్తే అర్థం అవుతోంది. ఒకరిలో పవిత్ర చంద్రకాంత్ తో కలిసి నడుస్తూ ఉన్నారు.

ఆ రీల్ షేర్ చేసి, “రెండు హృదయాలు. కానీ ఒకటే ఊపిరి” అని రాశారు. అప్పుడే వీళ్లిద్దరూ జంట అనే విషయం ఇంకా ఎక్కువ మందికి తెలిసింది. అంతకుముందు ఒక కన్నడ పాటకి రీల్ షేర్ చేసి, “నా నవ్వులో నేను నిన్ను గుర్తు చేసుకుంటున్నాను” అని చంద్రకాంత్ ని ఉద్దేశించి వీడియో షేర్ చేశారు పవిత్ర. గతంలో కూడా చంద్రకాంత్ తో కలిసి దిగిన ఫోటోలని షేర్ చేశారు. పవిత్ర గత నెల అంటే ఏప్రిల్ 14వ తేదీన తన పుట్టినరోజు జరుపుకున్నారు. దాంతో చాలా మంది పవిత్ర కి విషెస్ చెబుతూ పోస్ట్ లు షేర్ చేశారు. త్రినయని సీరియల్ లో నటించిన వారు కూడా పవిత్ర ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు.


End of Article

You may also like