తెలుగు హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన యానిమల్ సినిమా భామా…!

తెలుగు హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన యానిమల్ సినిమా భామా…!

by Mounika Singaluri

Ads

సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ రష్మిక మందన జంటగా వచ్చిన చిత్రం యానిమల్. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో భారీ సక్సెస్ అందుకుంది. అయితే యానిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసిన తృప్తి దిమ్రి ఈ సినిమా ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది. యానిమల్ సినిమాలో తృప్తిని చూసిన ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఆమె గురించి వెతుకుతున్నారు.

Video Advertisement

ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె ట్రెండింగ్ అవుతుంది. తన అందచందాలతో పాటు నటనతో కూడా ఆడియన్స్ చేత విజిల్స్ వేయించింది. యానిమల్ సినిమాలో రియాజ్ పాత్రలో తనదైన ముద్రవేసింది.

అయితే ఈ భామకు తెలుగులో ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తుంది. మాస్ మహారాజా రవితేజ ఇటీవల టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన ఈగల్ సినిమాతో బిజీ బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా తృప్తి దిమ్రిని తీసుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ అమ్మడికి తెలుగులో వరుస పెట్టి ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. తృప్తి హిందీలో పలు విజయవంతమైన చిత్రాలు నటించింది.

అందంతో పాటు మంచి అభినయం కూడా ఉంది. ఇక యానిమల్ సినిమాలో తృప్తి బోల్డ్ గా నటించి సెన్సేషనల్ అయింది. గతంలో బుల్ బుల్, మామ్ వంటి చిత్రాలు నటించి మెప్పించింది.యానిమల్ సినిమాతో వచ్చిన క్రేజ్ ని తృప్తి నిలబెట్టుకుంటే తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. కాగా అనిల్ రావుపూడి రవితేజ కాంబినేషన్ లో ఇప్పటికే రాజా ది గ్రేట్ సినిమా వచ్చింది. అది సూపర్ డూపర్ హిట్ అయింది మళ్ళీ మీరు కాంబినేషన్ లో సినిమా అంటే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి.

Also Read:సినిమా రిలీజ్ అయిన 6 నెలలకు ఓటీటీలోకి వచ్చిన “దగ్గుబాటి” హీరో సినిమా…ఎందులో చూడచ్చు అంటే.?


End of Article

You may also like