Tripti Dimri: “యానిమల్” చూసి అందరూ క్రష్ లిస్టులో యాడ్ చేసుకున్నారు.. ఈమె విరాట్ కోహ్లీ కి చెల్లి అవుతుందా..?

Tripti Dimri: “యానిమల్” చూసి అందరూ క్రష్ లిస్టులో యాడ్ చేసుకున్నారు.. ఈమె విరాట్ కోహ్లీ కి చెల్లి అవుతుందా..?

by Mounika Singaluri

Ads

ప్రస్తుతం యానిమల్ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ ని, టాలీవుడ్ బాక్సాఫీస్ ని ఊపేస్తుంది. సినిమా ఫస్ట్ రోజు నుండి కూడా హిట్ టాక్ సంపాదించుకుంది. ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యేసరికి 450 కోట్ల పైగా కలెక్షన్స్ సాధించింది. రణబీర్ కపూర్ వైలెంట్ నటన సినిమాకి మేజర్ హైలైట్ గా నిలిచింది. సందీప్ రెడ్డి వంగా రణబీర్ ని ఒక లెవెల్ లో ప్రజెంట్ చేశాడు. ఎక్కడ చూసినా యానిమల్ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. సినిమా సెలబ్రిటీలు సైతం యానిమల్ ని పొగుడుతూ పోస్టులు పెడుతున్నారు.

Video Advertisement

ఈ లెక్కలు చూస్తే యానిమల్ క్రేజ్ ఇప్పట్లో ఆగేలా లేదు. కలెక్షన్స్ కూడా ఏ రేంజ్ కి వెళ్తాయో అంటూ సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇంటర్నెట్ లో ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. యానిమల్ సినిమాలో జోయపాత్రలో నటించిన త్రిప్తి దిమ్రి విరాట్ కోహ్లీకి చెల్లెలు అవుతుందంటూ చెబుతున్నారు. ఇది నిజమా కాదా అంటూ చాలామంది షాక్ అవుతున్నారు.

యానిమల్ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన అయినా కూడా ఒక చిన్న రోల్ చేసిన త్రిప్తి దిమ్రి టాప్ ఆఫ్ ది టౌన్ అయింది. ఉన్న పది నిమిషాలు అయినా సరే తన అంద చందాలతో అభిమానులను ఆకట్టుకుంది. రణబీర్ తో కలిసి రొమాన్స్ లో రెచ్చిపోయింది. త్రిప్తిని అందరూ కూడా తమ క్రష్ లిస్టులో యాడ్ చేసేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో త్రిప్తికి ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఈ చిన్నది భారీ ఆఫర్స్ ని సైతం సొంతం చేసుకున్నట్లు వినిపిస్తుంది. ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమాలో త్రిప్తి ఎన్నికైనట్లు వార్త వచ్చింది. అలాగే రవితేజ సినిమాలో కూడా త్రిప్తి నటిస్తోంది అంటూ టాలీవుడ్ లో వార్త హల్చల్ చేస్తుంది.

అయితే త్రిప్తి విరాట్ కోహ్లీకి చెల్లెలు ఎలా అవుతుంది అనే విషయం చూస్తే… త్రిప్తి బాలీవుడ్ లో బుల్ బుల్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా నిర్మాత కర్నేష్ శర్మ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ స్వయంగా అన్నయ్య అవుతాడట. ఈ సినిమా సమయంలో త్రిప్తి, కర్నేష్ ఇద్దరు ప్రేమలో పడ్డారట. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారట. ఆ లెక్కన చూస్తే త్రిప్తి విరాట్ కోహ్లీకి చెల్లెలి వరుస అవుతుంది. అయితే ఇప్పుడు ఇద్దరూ విడిపోయారని బాలీవుడ్ లో వార్త చకర్లు పుడుతుంది.


End of Article

You may also like