ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వాణిస్తుంది. 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించడంతో అటు సామాన్య ప్రజలే కాదు, ఇటు సెలెబ్రిటీలు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఫుల్ ఆక్టివ్ గా ఉంటున్నారు. ఇది ఇలా ఉండగా. హీరోయిన్ త్రిష తన స్నేహితులైన రానా, అల్లు అర్జున్ తో వీడియో చాట్ చేసింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ కి సంబందించిన ఒక విషయం బయటపడింది.

Video Advertisement

ఈ వీడియో చాట్ గురించి త్రిష తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ లో అల్లు అర్జున్ ఆఫీసియల్ అకౌంట్ ని కాకుండా బన్నీ ప్రైవేట్ అకౌంట్ ను టాగ్ చేసింది త్రిష. త్రిష చేసిన పోస్ట్ వల్ల @bunny_boy_private అనే పేరు మీద బన్నీకి మరో ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఉంది అనే విషయం వెలుగులోకి వచ్చింది. ఆ అకౌంట్ లో కేవలం 250 మంది ఫాలోవెర్స్ మాత్రమే ఉన్నారు. 744 పోస్టులు పెట్టినట్టు తెలుస్తుంది.alluarjunonline అనే పేరు మీద అల్లు అర్జున్ ఆఫీసియల్ అకౌంట్ ఉంది.