ఎట్టకేలకు విడుదల కాబోతున్న త్రిష తెలుగు వెబ్ సిరీస్..! ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?

ఎట్టకేలకు విడుదల కాబోతున్న త్రిష తెలుగు వెబ్ సిరీస్..! ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?

by Mohana Priya

Ads

తెలుగు తమిళ భాషల్లో ఎన్నో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకున్నారు త్రిష. అయితే త్రిష హీరోయిన్ గా ఎన్ని సినిమాలు చేసినా కూడా ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేసినప్పుడు వాటికి అంత పెద్ద గుర్తింపు లభించలేదు. త్రిష మంచి నటి.

Video Advertisement

కానీ స్క్రిప్ట్ పరంగా బలహీనమైన సినిమాలు ఎంచుకోవడం వల్ల ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడంలో త్రిష విఫలం అయ్యారు. ఒకపక్క స్టార్ హీరోలతో నటిస్తూనే, మరొక పక్క తన పాత్రకి ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేశారు. కానీ వాటిలో చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు ఒక్కటి కూడా లేదు. త్రిష చాలా రోజుల క్రితం తెలుగులో ఒక వెబ్ సిరీస్ చేశారు.

దాని పేరు బృంద. ఈ సిరీస్ కి సూర్య దర్శకత్వం వహించారు. ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్న ఈ సిరీస్, త్రిష మార్కెట్ డౌన్ ఉండడం కారణంగా విడుదల అవ్వలేదు. ఇప్పుడు ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నట్టు సమాచారం. ఇది సోనీ లివ్ యాప్ లో స్ట్రీమ్ అవుతుంది అని అంటున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో కానీ, లేదా చివరి వారంలో కానీ ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకి వస్తుంది. గత కొంత కాలం నుండి త్రిష తెలుగులో పెద్దగా సినిమాలు చేయట్లేదు.

ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత త్రిష చిరంజీవి సినిమాలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియదు. కానీ మరొక పక్క త్రిష తమిళంలో మాత్రం వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల విజయ్ హీరోగా నటించిన లియో సినిమాలో నటించారు. ఇప్పుడు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ పక్కన కూడా నటించబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. త్రిష ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అయ్యింది. అయినా కూడా ఇప్పటికీ త్రిష వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.


End of Article

You may also like