ప్రస్తుతం ఉన్న టాప్ డైరెక్టర్లలో ఒకరు త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి దర్శకుడు మాత్రమే కాదు. మంచి రచయిత కూడా అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త్రివిక్రమ్ పాటించే సెంటిమెంట్స్ కూడా మనకి ఐడియా ఉన్నాయి. అందులో మొదటిది హీరోయిన్లని రిపీట్ చేయడం. అలాగే ఇంకొకటి తన ప్రతి సినిమా టైటిల్ అ తో మొదలయ్యేలా చూసుకోవడం. అయితే ఇవి మాత్రమే కాకుండా త్రివిక్రమ్ కి మరొక సెంటిమెంట్ కూడా ఉందట. త్రివిక్రమ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పంజాగుట్టలోని సాయిబాబా గుడి దగ్గర ఒక చిన్న రూం లో అద్దెకి ఉండేవారు.

8 trivikram

ఆ ఇంట్లో ఉన్నప్పుడే స్వయంవరం, సముద్రం, నువ్వే కావాలి, నిన్నే ప్రేమిస్తా, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్ సినిమాలకి మాటలు అందించారు త్రివిక్రమ్. ఆ ఇల్లు అంటే త్రివిక్రమ్ కి ఎంతో ఇష్టమట. ఇప్పటికి కూడా ఆ ఇంటిని వదులుకోలేక ప్రతినెల ఐదువేల రూపాయలు అద్దె చెల్లిస్తారట. అంతే కాకుండా ఇప్పటికి కూడా అప్పుడప్పుడు ఆ ఇంటికి వెళ్లి కథలు, మాటలు రాస్తారట. ఆ ఇల్లు అంటే త్రివిక్రమ్ కి అంత సెంటిమెంట్. ప్రస్తుతం త్రివిక్రమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్ల నాయక్ తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోయే సినిమా పనిలో బిజీగా ఉన్నారు.