సంక్రాంతికి సూపర్ హిట్ అయిన చిత్రం “అల వైకుంఠపురంలో …ఇటీవలే ఈ సినిమా సక్సెస్ మీట్ విశాఖపట్నంలో జరిగింది.ఈ సక్సెస్ మీట్ లో త్రివిక్రమ్ మాట్లాడుతూ “అల వైకుంఠపురములో సినిమా గురించి ఇప్పటికే చాలా చెప్పాము. కానీ ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా కొన్ని చెప్పాలి.

Video Advertisement

ఈ సినిమాని తన భుజం మీద మోసుకొచ్చాడు థమన్. విలువలతో సినిమా తీయండి. మేమెందుకు ఆదరించమో.. చూపిస్తాం అని మీరంతా చెప్పారు.

అది మాకు చాలా నమ్మకాన్ని ఇచ్చింది.ఈ సినిమాలో నవదీప్ ఓ పాత్రలో నటించిన విషయం అందరికి తెలిసిందే. ఇక అసలు విషయానికి వస్తే త్రివిక్రమ్ భార్య నవదీప్ కి ఫ్యాన్ అంట. బిగ్ బాస్ 1 సీజన్లో నవదీప్ ప్రవర్తించిన తీరుని చూసి తన భార్య కొడుకు నవదీప్ కి అభిమానులు అయ్యారు అని చెప్పారు త్రివిక్రమ్.

సినిమాలో అందరిగురించి మాట్లాడారు కానీ నవదీప్ గురించి ఫస్ట్ మరిచిపోయారు. ఈ క్రమంలో నవదీప్ గురించి మాట్లాడకపోతే నా భార్య నన్ను తిడుతుంది అని అసలు విషయం చెప్పి అందరిని నవ్వించారు త్రివిక్రమ్. కేవలం నవదీప్ ని చూడటం కోసం నా భార్య పారిస్ షూట్ కి వచ్చింది అని నవ్వుతు చెప్పారు త్రివిక్రమ్.