ఏంటి నాగార్జున గారు…సోషల్ డిస్టెన్స్ అన్నారు.! మరి ఇదేంటి.? అంటూ నెటిజెన్స్ ట్రోల్ల్స్ .!

ఏంటి నాగార్జున గారు…సోషల్ డిస్టెన్స్ అన్నారు.! మరి ఇదేంటి.? అంటూ నెటిజెన్స్ ట్రోల్ల్స్ .!

by Mohana Priya

Ads

బిగ్ బాస్ షో లో ఇటీవల జరిగిన ఒక సంఘటన చర్చలకు దారి తీస్తోంది. అసలు బిగ్ బాస్ అంటేనే కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్. షో కి పబ్లిసిటీ వచ్చేది కూడా అలాంటి కాంట్రవర్సీలతోనే. కానీ ఇప్పుడు చర్చ జరుగుతోంది మాత్రం కంటెస్టెంట్స్  మీద కాదు బిగ్ బాస్ హోస్ట్ కింగ్ నాగార్జున మీద. వివరాల్లోకి వెళితే.

Video Advertisement

గత వారం ఎవరూ ఊహించని విధంగా ఆరోగ్య సమస్యల కారణంగా నోయల్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్ళిపోయారు. అంతకు ముందు వారం దివి ఎలిమినేట్ అయ్యారు.

దివి ఎలిమినేట్ అయిన ఎపిసోడ్ కి సమంత హోస్ట్ గా వచ్చారు. గత వారం మళ్లీ నాగార్జున హోస్ట్ పొజిషన్ లోకి వచ్చేశారు. ఆ రోజు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ నోయల్ తో నాగార్జున మాట్లాడారు.

మాట్లాడేటప్పుడు నాగార్జున, నోయల్ కొంచెం డిస్టెన్స్ లో నిలబడి  మాట్లాడుకున్నారు. అందుకు కారణం తాను వేరే ప్రదేశాలకి వెళ్ళి వచ్చారు కాబట్టి, సోషల్ డిస్టెన్స్ పాటించడం బెటర్ అని నాగార్జున చెప్పారు. కానీ అదే రోజు దివి తో నాగార్జున దిగిన ఒక ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు దివి.

అయితే ఆ ఫోటోలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నట్టుగా కనిపించలేదు. దాంతో నెటిజన్లు ఈ విషయాన్ని పాయింట్ అవుట్ చేస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ ఒక్క చోట మాత్రమే పాటించడం ఏంటి? అని, ఫోటో దిగేటప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటించలేదు? అని అంటున్నారు.

 


End of Article

You may also like