బాలయ్య బాబు ఫోన్ విసిరేయడంపై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్ల్స్…పాపం హీరోని పోస్టర్ ముట్టుకోనివ్వలేదుగా.!

బాలయ్య బాబు ఫోన్ విసిరేయడంపై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్ల్స్…పాపం హీరోని పోస్టర్ ముట్టుకోనివ్వలేదుగా.!

by Mohana Priya

Ads

నందమూరి బాలకృష్ణ సోమవారం ఒక ఈవెంట్ లో సందడి చేశారు. సెహరీ అనే సినిమా ఫస్ట్ లుక్ బాలకృష్ణ చేతుల మీదుగా విడుదల అయ్యింది. హర్ష్ కనుమిల్లి ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ నగరానికి ఏమైంది సినిమా ఫేమ్ సిమ్రాన్ చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. వర్గో పిక్చర్స్ పతాకంపై అద్వయ జిష్ణు రెడ్డి, శిల్ప చౌదరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. అంతరిక్షం, మెంటల్ మదిలో సినిమాలకు సంగీతం అందించిన ప్రశాంత్ ఆర్ విహారి ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

Video Advertisement

ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇవాళ బాలకృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ “ఇప్పుడున్న పరిస్థితుల్లో మానసిక ధైర్యం చాలా ముఖ్యం, మానసికంగా ధైర్యంగా ఉంటే ఇలాంటివన్నీ అధిగమించవచ్చు, ఆస్పత్రులు కూడా అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వాలి, రాబోయే రోజుల్లో కూడా మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి” అని అన్నారు. అలాగే సినిమా విజయం సాధించాలని అని చిత్ర బృందానికి విషెస్ అందించారు.

ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ సినిమాలో హీరోయిన్ గా నటించిన సయేషా ఒక ముఖ్య పాత్ర పోషించనున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన బీబీ 3 ఫస్ట్ రోర్ యూట్యూబ్ లో సెన్సేషన్ సృష్టించింది.

అంతేకాకుండా చాలా సంవత్సరాల క్రితం బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో నటించిన నర్తనశాల 17 నిమిషాల సినిమా దసరా సందర్భంగా ఓటీటీలో విడుదలైంది. నర్తనశాల ద్వారా ఇవాళ మన మధ్య లేని నటులు సౌందర్య గారిని, శ్రీహరి గారిని మళ్లీ చూడగలిగాం అని ప్రేక్షకులు ఆనందించారు. ఈ సినిమా పే పర్ వ్యూ గా విడుదల చేశారు. దీని ద్వారా వచ్చిన డబ్బుల్లో సగం మొత్తాన్ని చారిటీకి అంత చేయబోతున్నట్టు బాలకృష్ణ ప్రకటించారు. సెహరీ సినిమా ఫస్ట్ లుక్ విడుదల ఈవెంట్ మధ్యలో ఫోన్ రావడంతో బాలకృష్ణ ఫోన్ పక్కకి విసిరేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఇలా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

#1 #2 #3 #4 #5 #6 #7 #8 #9 #10 #11#12

#13

#14

#15

#16


End of Article

You may also like