త్వరలో బిగ్ బాస్ 4 మొదలవ్వడంపై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్ల్స్…చూసి నవ్వుకోండి.!

త్వరలో బిగ్ బాస్ 4 మొదలవ్వడంపై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్ల్స్…చూసి నవ్వుకోండి.!

by Megha Varna

Ads

మనం రోజు టీవీలో చూసే సెలబ్రిటీలు నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అలా సెలబ్రిటీస్ రియల్ లైఫ్ ని చూపించిన ప్రోగ్రాం బిగ్ బాస్. హిందీలో చాలా హిట్ అయిన ఈ కార్యక్రమం తెలుగులో ఎలా ఉంటుందో అని మొదట్లో కొంచెం సంకోచం ఉండేది కానీ తెలుగులో కూడా ఊహించని విధంగా స్పందన వచ్చింది.

Video Advertisement

మొదటి సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్, రెండవ సీజన్ లో నాని, మూడవ సీజన్లో నాగార్జున తమ హోస్టింగ్ తో బిగ్ బాస్ షోని జనాలకి ఇంకా చేరువయ్యేలా చేశారు. ఇలా విజయవంతంగా మూడు సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు నాలుగవ సీజన్ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సీజన్ కి కూడా నాగార్జున నే హోస్ట్ గా వ్యవహరిస్తారు. ప్రోమో కూడా విడుదల అయ్యింది.

ఈ లాక్ డౌన్ సమయంలో సీరియల్స్ లేక, మొదలైనవి కూడా మళ్లీ ఆగిపోయి, రిపీటెడ్ ఎపిసోడ్ లతో, చాలా మందికి బోర్ కొడుతోంది. వీడియో కాల్స్ ద్వారా ఇంటర్వ్యూ తీసుకుంటూ చేసిన కొత్త షోస్ కూడా ఏవి అంతగా అలరించలేకపోయాయి. ఇలాంటి సమయంలో ఎడారిలో ఒక్క చినుకు వర్షం పడినట్టు సడన్ గా ఇటీవల మా టీవీ యాజమాన్యం బిగ్ బాస్ ఫోర్ ప్రోమో విడుదల చేసింది.

అసలు మామూలుగానే బిగ్ బాస్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. అది కూడా ఇలాంటి సమయంలో షో స్టార్ట్ అయితే ఇంక టి ఆర్ పి ఏ రేంజ్ లో ఉంటుందో ముందే ఊహించుకోవచ్చు. గత సీజన్ లో తన హోస్టింగ్ తో అలరించిన కింగ్ నాగార్జున ఈ సీజన్ లో కూడా వారం వారం కంటెస్టెంట్ ల పనిపట్టే బాధ్యతను తీసుకున్నారు. ఈసారి బిగ్ బాస్ లోకి అడుగు పెట్టబోయే కంటెస్టెంట్ లు వీరే అంటూ ఎంతో మంది పేర్లు వినిపిస్తున్నాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ జాబితాలో ఉన్న కొంత మంది సెలబ్రిటీలు స్పందించి వాళ్ళు బిగ్ బాస్ కి వెళ్లట్లేదు అని చెప్పారు. తర్వాత కూడా ఎంతో మంది పేర్లు వినిపించడం మళ్లీ వాళ్లు అసలు ఆ వార్తలన్నీ పుకార్లు అని చెప్పడం జరుగుతూనే ఉన్నాయి.

బిగ్ బాస్ మొదలవడానికి ఇంకా కొద్దిరోజులు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు కన్ఫామ్ అయిన కంటెస్టెంట్స్ అని కొంత మంది సెలబ్రిటీల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే.

ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లిస్ట్ ఇదే. నిజంగానే బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ వీళ్లేనా? లేదా మళ్ళీ వీళ్లు కూడా ” మేము బిగ్ బాస్ కి వెళ్లట్లేదు” అని చెప్తారా? దాదాపు అందరికీ ఇదే అనుమానం వస్తుంది.

వీళ్ళు నిజంగానే బిగ్ బాస్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ అయ్యుండొచ్చు. లేదా కాకపోయి ఉండవచ్చు. స్టార్ మా లో బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్ మొదలయ్యేంతవరకు, కింగ్ నాగార్జున కంటెస్టెంట్ లను ఎనౌన్స్ చేసేంతవరకు ఈ లిస్ట్ మారుతూనే ఉంటుంది.

1.

2.

3.

4.

5.

6.

7.

8.

9.

10.

11.


End of Article

You may also like