ఏంటయ్యా “మాస్టర్”..కూకట్ పల్లి లో విమానాశ్రయం ఎక్కడుంది.? ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్.!

ఏంటయ్యా “మాస్టర్”..కూకట్ పల్లి లో విమానాశ్రయం ఎక్కడుంది.? ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్.!

by Mohana Priya

Ads

మనం సినిమా నచ్చితే ఏ భాషలో అయినా సరే ఒకేలాగా ఆదరిస్తాం. అందుకే మన భాషలోని సినిమాలు వేరే భాషల్లోకి, వేరే భాషల సినిమాలు మన భాషలోకి డబ్ చేస్తూ ఉంటారు. తెలుగులోకి డబ్ అయ్యే సినిమాలు ఎక్కువగా తమిళ్ భాష నుంచి అవుతాయి. తమిళ్ హీరోలు అయిన సూర్య, విక్రమ్, అజిత్, విజయ్, కార్తీ, విశాల్ వీళ్ళందరికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా క్రేజ్ ఉంది.

Video Advertisement

ఇంక రజనీకాంత్, కమల్ హాసన్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకోండి. వీరందరికీ తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వారు కూడా మన ఆడియన్స్ కోసం మన నేటివిటీని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తున్నారు. డబ్ చేసేటప్పుడు కూడా తమిళ్ అక్షరాలు ఉన్న చోట తెలుగుని రిప్లేస్ చేస్తున్నారు.

Master movie mistaken edit

వాళ్ళు ఉండే ప్రాంతాల పేర్లు కూడా మన ప్రాంతాల పేర్లుగా మారుస్తున్నారు. కానీ ఇలా ఎడిట్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. వీటిని పూర్తిగా పొరపాటు అని అనలేము. కానీ ఇంత చిన్న మిస్టేక్ ని తెలుగులో డిఫైన్ చేయడానికి పొరపాటు అనే పదం తప్ప వేరే పదం లేదు.

Master movie mistaken edit

అయితే, తమిళ్ స్టార్ హీరో విజయ్ కి తెలుగులో ఉన్న క్రేజ్ గురించి మనందరికీ తెలుసు. విజయ్ సినిమాలు కూడా తమిళ్ లో రిలీజ్ అయిన డేట్ కే తెలుగులో కూడా రిలీజ్ అవుతాయి. అలా ఇటీవల విడుదలైన సినిమా మాస్టర్. మాస్టర్ సినిమా థియేటర్లలో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా కూడా సూపర్ హిట్ గా దూసుకుపోతోంది. ఈ సినిమాని జనవరి 29 వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు.

Master movie mistaken edit

మాస్టర్ సినిమాలో మెన్షన్ చేసిన ఒక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అదేంటంటే, సినిమాలో విజయ్ ఎంట్రీ అయిన తర్వాత ఒక ఫైట్ సీన్ ఉంటుంది. అందులో కొంతమంది మెట్రో ఎక్కుతారు. వాళ్లని ఫాలో అవుతూ విజయ్ కూడా మెట్రో ఎక్కుతారు. సినిమా తెలుగు వాళ్ళకి తగ్గట్టు మార్చారు కాబట్టి మెట్రో స్టేషన్ పేరు కూకట్ పల్లి విమానాశ్రయం అని రాశారు.

Master movie mistaken edit

మళ్లీ పక్కనే బ్రాకెట్ లో ఎల్.బి.నగర్ అని కూడా ఉంటుంది. ఇందులో పాయింట్ ఔట్ చేసిన విషయం ఏంటో ఇప్పటికే మీలో చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది. ఇలా ఈ ఒక్క సినిమాలో మాత్రమే కాదు చాలా సినిమాలో జరుగుతూనే ఉంటాయి. కానీ వీటివల్ల సినిమాకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు కాబట్టి ప్రేక్షకులు కూడా అంత పెద్దగా పట్టించుకోరు. కానీ ప్రస్తుతం ఈ సినిమా ట్రెండింగ్ లో ఉంది కాబట్టి దీనిపై ఇలా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

#1

#2#3

#4


End of Article

You may also like