Ads
సాధారణంగా బయోపిక్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఒక మనిషి జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా బయోపిక్ తీస్తారు. అందులో కొన్ని సినిమాటిక్ లిబర్టీతో మారిస్తే కొన్ని మాత్రం నిజజీవితంలో ఎలా జరిగాయో అలాగే చూపిస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది సినిమా రంగానికి చెందిన ప్రముఖుల తో పాటు, ఇతర రంగానికి చెందిన ప్రముఖుల జీవితాలను కూడా బయోపిక్ రూపంలో మనకి ప్రెజెంట్ చేస్తున్నారు.
Video Advertisement
ఈ సినిమాల ద్వారా వారు బయట ఎప్పుడు మాట్లాడని ఎన్నో విషయాలు మనకు తెలుస్తున్నాయి. ఒక్క లాంగ్వేజ్ లో మాత్రమే కాకుండా దాదాపు ప్రతి భాషలో బయోపిక్స్ వస్తున్నాయి. బయోపిక్ అంటే వారి జీవితంలో జరిగిన సంఘటనలు మాత్రమే కాకుండా వారు చూడడానికి ఎలా ఉంటారో, సినిమాలో ఆ పాత్రలో నటించే నటులు కూడా అలాగే ఉండేలాగా చూసుకుంటారు. వారి ఎలా నడుస్తారు, ఎలా మాట్లాడుతారు, హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా సినిమాలో మ్యాచ్ అయ్యేలా చూసుకుంటారు.
కానీ కొన్నిసార్లు అవి నిజ జీవితంలో ఉన్న వ్యక్తి ఫీచర్స్ కి మ్యాచ్ అవ్వవు. ఇటీవల ఇలాంటి ఒక పాయింట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా సైనా. ఈ సినిమాలో పరిణీతి చోప్రా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. సైనా సినిమాకి స్టాన్లీ కా డబ్బా వంటి ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన అమోల్ గుప్తే దర్శకత్వం వహిస్తున్నారు.
సైనా పాత్ర కోసం పరిణీతి చోప్రా చాలా ట్రైనింగ్ తీసుకున్నారు. సైనా నెహ్వాల్ మాటతీరు, వాకింగ్ స్టైల్ గమనించడంతో పాటు, ముఖ్యంగా బ్యాడ్మింటన్ కూడా నేర్చుకున్నారు. అయితే సైనా నెహ్వాల్ కి ఎడమ వైపు చెంపపై ఒక పుట్టుమచ్చ ఉంటుంది. సైనా పాత్ర పోషిస్తున్న పరిణీతికి కూడా అలాగే ఎడమ వైపు చెంప పైన పుట్టుమచ్చ పెట్టారు.
కానీ సైనా నెహ్వాల్ పుట్టుమచ్చతో పోల్చిచూస్తే పరిణీతి చోప్రా పుట్టుమచ్చ కొంచెం పెద్దగా అనిపించింది. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతూ ,”ఆ పుట్టుమచ్చ పాత సినిమాల్లో విలన్ కి ఉన్నట్టుగా ఉంది” అని అంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వస్తున్నాయి.
End of Article