Ads
బాలీవుడ్ సినిమాలకి, సౌత్ ఇండియన్ సినిమాలకి మధ్య చాలా తేడా ఉంటుంది అని చాలామంది సెలబ్రిటీలు చెప్పారు. ఇంక హిందీ ఇండస్ట్రీ వాళ్ళు అయితే సౌత్ లో ఉన్న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం లో ఏ ఒక్క భాష లో నటించినా కూడా సౌత్ ఇండియన్ యాక్టర్ అని అంటారు. సౌత్ ఇండియాలో నాలుగు ఇండస్ట్రీస్ ఉన్నాయి అనే విషయం కూడా ఎక్కువ మంది పట్టించుకోరు.
Video Advertisement
అంతే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో నటించి, ఇక్కడ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని అలాగే బాలీవుడ్ లో కూడా నటిస్తున్న కొంతమంది నటులు కూడా బాలీవుడ్ చాలా ప్రోగ్రెసివ్ గా ఉన్నట్టు, సౌత్ ఇండియన్ సినిమాల్లో ఏదో తప్పు ఉన్నట్టుగా మాట్లాడుతారు. ఇవాళ పూజా హెగ్డే మాట్లాడిన ఒక మాట కూడా ప్రస్తుతం చర్చలకు దారి తీస్తోంది. వివరాల్లోకి వెళితే.
ప్రముఖ వెబ్ సైట్, అలాగే యూట్యూబ్ ఛానల్ అయిన ఫిలిం కంపానియన్ కి పూజా హెగ్డే ఇవాళ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ లో ప్రముఖ క్రిటిక్ అనుపమ చోప్రాతో మాట్లాడారు పూజా హెగ్డే. ఇంటర్వ్యూ మధ్యలో అనుపమ చోప్రా ” అల వైకుంఠపురం లో సినిమాలో అల్లు అర్జున్ పాత్ర మీ కాళ్ళని చూస్తున్నట్టుగా చూపించారు. ఒక వేళ నిజంగా ఆఫీస్ లో అలాంటి సంఘటనలు ఎదురైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఈ విషయం గురించి ఏమైనా మాట్లాడారా? మీరు అబ్జెక్షన్ చెప్పలేదా?” అని అడిగారు.
అందుకు పూజా హెగ్డే ” ముందు కాళ్ళను చూసినా కూడా, తర్వాత నేను హీరో తల పైన ఒక బుక్ పెట్టి ” బరువు పైన ఉంటే, కింద చూడరు” అని చెప్తాను. తర్వాత అప్పుడు హీరో నన్ను ఇష్టపడతాడు. ముందు అలా కాళ్లు చూపించినా కానీ, తర్వాత నన్ను చూసి ఇష్టపడినట్టు చూపించారు. సౌత్ ఇండియన్స్ కి నడుము అబ్సెషన్ ఉంటుంది. నాకు పిక్చరైజేషన్ లో కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఏదేమైనా పాయింట్ ఏమీ లేకుండా ఆబ్జెక్టిఫై చేయడం తప్పు” అని అన్నారు.
అంతకు ముందు అకౌంట్ హ్యాక్ అయింది అనే విషయంపై కూడా సోషల్ మీడియాలో చాలా రోజుల వరకు పూజా హెగ్డే చర్చలో ఉన్నారు. ఇప్పుడు మళ్లీ ఈ విషయంపై పూజా హెగ్డే పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దాంతో ఇలా ట్రోల్ చేస్తున్నారు.
#1 #2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
End of Article