పోస్టర్ పోస్ట్ చేసేముందు చూసుకోవాలి కదా.? ఆ ఎడిటింగ్ తప్పులు ఏంటో అంటూ ట్రోల్ల్స్.!

పోస్టర్ పోస్ట్ చేసేముందు చూసుకోవాలి కదా.? ఆ ఎడిటింగ్ తప్పులు ఏంటో అంటూ ట్రోల్ల్స్.!

by Mohana Priya

Ads

గత కొంత కాలం నుండి ప్రేక్షకులు సినిమా చూసే విధానం చాలా వరకు మారింది. అంతకుముందు “సినిమా వచ్చిందా? చూశామా? హిట్టా? ఫ్లాపా?” అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అన్నిటినీ అబ్జర్వ్ చేసి కానీ ఒక సినిమా హిట్టా ఫ్లాపా అనే జడ్జిమెంట్ కి రావట్లేదు. థియేటర్లో సినిమా చూసినప్పుడు ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేయడం పక్కనపెడితే, సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ లని కూడా డీటెయిల్డ్ గా చూసి అందులో చాలా వరకూ ప్రేక్షకులు అబ్జర్వ్ చెయని  కొన్ని విషయాలని చెప్తున్నారు.

Video Advertisement

అంతే కాకుండా వాటిలో ఉన్న చిన్న చిన్న పొరపాట్లని కూడా పాయింట్ అవుట్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే. ఇవాళ నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న టక్ జగదీష్ సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ లో సంక్రాంతి విషెస్ చెప్పడం తో పాటు, సినిమా ఏప్రిల్ 16వ తేదీన విడుదలవుతుందని కూడా ప్రకటించారు.

సినిమాకి సంబంధించిన వాళ్ళు అందరూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో ఈ పోస్టర్ పోస్ట్ చేశారు. కానీ తర్వాత అంతకుముందు షేర్ చేసిన పిక్చర్ డిలీట్ చేసి మళ్లీ పోస్ట్ చేశారు. సడన్ గా చూడగానే మనలో చాలా మందికి “అదేంటి. అంతకు ముందు పోస్ట్ చేసిన దాన్ని డిలీట్ చేసి మళ్ళీ ఎందుకు పోస్ట్ చేశారు?” అని అనిపించి ఉండొచ్చు. కానీ ఒకసారి సరిగ్గా గమనిస్తే అలా ఎందుకు చేశారో అర్థమవుతుంది.

పైన ఉన్నది మొదట పోస్ట్ చేసిన పోస్టర్. ఇందులో ఎడమ వైపు చివరిలో రావు రమేష్ ఉన్నారు. ఆయన పక్కన నటి వైష్ణవి చైతన్య కూర్చుని ఉన్నారు. వైష్ణవి చైతన్య చెయ్యి దగ్గర ఒకసారి గమనించండి. ఒక వేలు ఉన్నట్టు అనిపిస్తుంది.

అలా ఎడిటింగ్ మిస్టేక్ అవ్వడం తో మళ్లీ ఎడిట్ చేసి పోస్టర్ విడుదల చేసింది సినిమా బృందం. పైన కనిపిస్తున్నది తర్వాత విడుదల చేసిన పోస్టర్.

కానీ ఇది ఒక్క ఈ సినిమా విషయంలోనే కాదు అంతకు ముందు కూడా కొన్ని సినిమాల పోస్టర్లలో ఎడిటింగ్ పొరపాట్లు కనిపించాయి. ఇటీవల న్యూఇయర్ సందర్భంగా విడుదలైన సినిమా పోస్టర్స్ లో నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న లవ్ స్టోరీ సినిమా పోస్టర్ కూడా ఉంది. ఈ పోస్టర్ లో కూడా సాయి పల్లవి డ్రెస్ గమనిస్తే కొంచెం ఎరేజ్ అయినట్టు ఉంటుంది.

అదే రోజు రవితేజ హీరోగా వస్తున్న కిలాడీ సినిమా పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో ఇద్దరు రవితేజలు కనిపిస్తూ ఉంటారు. ఇందులో ఒక రవితేజ చేతిలో గన్ ఉంటుంది. గన్ పట్టుకున్న చెయ్యి దగ్గర ఎడిటింగ్ పొరపాటు జరిగింది.  ఈ ఎడిటింగ్ పొరపాట్ల పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2 #3#4

#5


End of Article

You may also like