దీనికి బదులు “రాధే శ్యామ్” పోస్టర్ రిలీజ్ చేయొచ్చు కదా..? అంటూ… రెండేళ్ల తర్వాత “సాహో” అన్ సీన్ పోస్టర్ విడుదలపై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్స్..!

దీనికి బదులు “రాధే శ్యామ్” పోస్టర్ రిలీజ్ చేయొచ్చు కదా..? అంటూ… రెండేళ్ల తర్వాత “సాహో” అన్ సీన్ పోస్టర్ విడుదలపై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్స్..!

by Mohana Priya

బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన సినిమా సాహో. ఈ సినిమాకి సుజిత్ దర్శకత్వం వహించగా, యు.వి.క్రియేషన్స్ సంస్థ నిర్మించారు. సాహో సినిమాతో శ్రద్ధా కపూర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో రూపొందింది మిగిలిన భాషల్లోకి డబ్ అయ్యింది. తెలుగు ఇంకా హిందీ భాషల్లో తన పాత్రకి ప్రభాస్ డబ్బింగ్ చెప్పుకున్నారు. ప్రభాస్ కి హిందీ అంత పెద్దగా రాక పోయినా కూడా ఈ సినిమా కోసం నేర్చుకొని తానే డబ్బింగ్ చెప్పుకున్నారు.

Video Advertisement

Trolls on releasing Saaho unseen poster

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల పరంగా హిట్ అయినా కూడా కొంత మంది కథలో కొత్తదనం ఏమీ లేదు అని అన్నారు. కానీ సినిమా మెల్లగా జనాల్లోకి వెళ్లి కలెక్షన్ల పరంగా హిట్ టాక్ సంపాదించుకుంది. ఈ సినిమా వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతోంది. ఈ సినిమా విడుదల అయిన తర్వాత నుండి దర్శకుడు సుజిత్ ని ఎంతో మంది ప్రేక్షకులు ఈ సినిమా డిలీటెడ్ సీన్స్ రిలీజ్ చేయమని అడిగారు.

అందుకు సుజిత్ కూడా సరే అన్నారు కానీ మధ్యలో కరోనా రావడం అవ్వడం కారణంగా సాహో సినిమా డిలీటెడ్ సీన్స్ ఎడిట్ చేసి విడుదల చేయడానికి వీలు అవ్వలేదు. దాంతో సుజిత్ సోషల్ మీడియా అకౌంట్ లో సాహో సినిమా డిలీటెడ్ సీన్స్ విడుదల చేయమని మెసేజెస్ రావడం మొదలయ్యాయి. సుజిత్ అకౌంట్ లో మాత్రమే కాకుండా యు.వి.క్రియేషన్స్ సోషల్ మీడియా అకౌంట్ లో కూడా ఇలాంటి మెసేజెస్ వచ్చాయి వస్తున్నాయి కూడా.

bachelor heroes in tollywood

అయితే ఇప్పుడు సినిమా బృందం సాహో సినిమాకు సంబంధించిన ఒక సీన్ పోస్టర్ ని విడుదల చేశారు. దాంతో ఈ సినిమా విడుదల అయ్యి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు పోస్టర్ విడుదల చేయడం ఏంటి ఇదేదో సినిమా సమయంలోనే విడుదల చేయవచ్చు కదా ఇంత మంచి పోస్టర్ అప్పుడు రిలీజ్ చేయకపోవడం ఏంటి అని కామెంట్స్ మొదలయ్యాయి.

ఇది మాత్రమే కాకుండా ఈ సంవత్సరం ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యాం సినిమా విడుదలవ్వాల్సి ఉంది. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అడుగుతారు ఏమో అని డైవర్ట్ చేయడానికి యు.వి.క్రియేషన్స్ ఇలా చేసిందేమో అని సరదాగా సోషల్ మీడియాలో మీమ్స్ మొదలయ్యాయి.

#1

#2#3#4#5#6#7#8#9#10
#11#12#13#14#15


You may also like

Leave a Comment