స్టవ్ వెలిగించకుండా ఎలా వంట చేస్తున్నారు?

స్టవ్ వెలిగించకుండా ఎలా వంట చేస్తున్నారు?

by Megha Varna

Ads

బాలీవుడ్ లో బాగా సక్సెస్ అయినా హీరోయిన్స్ లో ఒకరు సోనమ్ కపూర్.ఈ ముద్దుగుమ్మ కు దేశమంతా అభిమానులు ఉన్నారు.తెలుగు వారికి కూడా మజకాలి పాటతో బాగా గుర్తిండిపోయారు సోనమ్ కపూర్.సోనమ్ ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు.తన లేటెస్ట్ ఫోటోలను తన సినిమాలకు సంబందించిన వివరాలను ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటారు సోనమ్ కపూర్.బాలీవుడ్ హీరోయిన్స్ అందరిలో కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉండే నటి సోనమ్ కపూర్.సోనమ్ చాలా ఖరీదైన ఇంటిలో ఢిల్లీలో నివాసం ఉంటున్నారు.

Video Advertisement

 

ఆ ఇంటికి సంబందించిన ఫోటోలను ప్రేక్షకులతో పంచుకున్నారు సోనమ్ కాగా అందరి దగ్గర నుండి ప్రశంసలు అందుకుంటున్నారు.అయితే తాజాగా గ్యాస్ ఆఫ్ చేసి వంట చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు సోనమ్.ఈ విషయానికి గాను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ల్స్ కి గురవుతున్నారు సోనమ్.

ఫోటో బాగుంది సోనమ్ గ్యాస్ ఆన్ చేస్తే ఇంకా బాగుండేది అని కామెంట్స్ చేస్తున్నారు పలువురు నెటిజన్లు.సోనమ్ ఓవర్ యాక్టింగ్ కు 500 రూపాయలు ఇవ్వాలని ,తన ఇష్టం అది తాను స్టవ్ ఆన్ చెయ్యకుండా వంట చేస్తారు అని ,పాపం సోనమ్ స్టవ్ ఆన్ చెయ్యడం మరిచిపోయారని రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు కొందరు.ఒక్క స్టవ్ ఆన్ చేయనందుకు పాపం సోనమ్ ను దారుణంగా ట్రోల్ల్స్ చేస్తున్నారు .కాగా సోనమ్ తాజాగా ది జోయా ఫాక్టర్,ఏక్ లాడికి కో దేక తో ఆసియ లాగ చిత్రాలలో నటించారు.ఇంకా కొన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయ్.

 


End of Article

You may also like