Thaman: ఈ కొత్తదనం ఏదో పాటలో కూడా చూపిస్తే బాగుండేది..! అంటూ.. తమన్ ని ఆడుకుంటున్న ట్రోలర్స్..!

Thaman: ఈ కొత్తదనం ఏదో పాటలో కూడా చూపిస్తే బాగుండేది..! అంటూ.. తమన్ ని ఆడుకుంటున్న ట్రోలర్స్..!

by kavitha

Ads

Jai Balayya Song: నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న సినిమా వీర‌సింహారెడ్డి. తాజాగా ఈ మూవీ నుండి జై బాల‌య్య సాంగ్ ని విడుదల చేశారు. అయితే ఈ పాటలో త‌మ‌న్ వెరైటీ డ్రెస్ లో క‌నిపించారు. దీంతో తమన్ ని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు.
thaman-telugu-addaమేక‌ర్స్ సోష‌ల్ మీడియాలో సినిమా కంటెంట్ బాగుంటే బాగా ప్ర‌మోట్ చేసుకుంటారు. కంటెంట్ బాగుంటే నెటిజ‌న్స్ కూడా స‌పోర్ట్ చేస్తారు.అయితే సినిమా బాలేనప్పుడు మాత్రం వాటిని ట్రోలర్స్ పని దొరికినట్టే ఇక.నెటిజెన్స్ ఓ రేంజ్ లో ఆడేసుకుంటారు. ప్రస్తుతం తమన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన వీర‌సింహారెడ్డి నుండి ఫస్ట్ సాంగ్ ‘జై బాలయ్య’ విడుదల చేసారు. దీనికి మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ సంగీతం అందిచారు. అంతే కాకుండా ఈ లిరికల్ వీడియో సాంగ్ లో ఇప్పటివరకు వేసుకొని డ్రెస్ లో త‌మ‌న్ కనిపించడమే కాకుండా స్టెప్స్ కూడా వేశారు.
thaman-1 telugu addaఅయితే అఖండ తరువాత చేస్తున్న సినిమా కావడంతో ఈ పాటను నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని బాలయ్య అభిమానులు ఊహించుకున్నారు. కానీ ఈ పాట నిరాశ పరిచింది. అంతే కాకుండా ఒసేయ్‌ రాములమ్మ సినిమాలో పాటలా ఉందని ట్రోలింగ్స్ మొదలయ్యాయి.దీంతో నెటిజెన్స్ సోషల్ మీడియాలో తమన్ పై ట్రోల్స్ స్టార్ట్ చేశారు. మీమర్స్, ట్రోలర్స్ తమ చేతికి పని చెప్పారు. బ్ర‌హ్మానందం ఫోటోలతో, వీడియోలతో రెచ్చి పోతున్నారు. డ్రెస్సింగ్ మీద పెట్టిన ఇంట్రెస్ట్, సాంగ్ మీద పెట్టలేదంటూ కామెంట్స్ పెడుతున్నారు.
S-Thaman-telugu addaబాల‌కృష్ణ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకుడు.రాయలసీమ బ్యాక్ డ్రాప్‌తో వస్తున్న ఈ మూవీలో శ్రుతీ హాసన్ హీరోయిన్‌. ఈ మూవీలో వరలక్ష్మి శరత్‌కుమార్, కన్నడ నటుడు దునియా విజయ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా సంక్రాంతి 2023 కి థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌టానికి రెడీ అవుతోంది.

Video Advertisement


End of Article

You may also like