Ads
సినిమా థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో కూడా ఎవరికీ తెలీదు. ఒకవేళ తెరిచినా కూడా కేవలం 50 శాతం సీట్ల ఆక్యుపెన్సీ మాత్రమే ఉంటుందట. కచ్చితంగా టికెట్ ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెద్ద సినిమాల సంగతి సరే. మీడియం బడ్జెట్ సినిమాలు ఈ పరిస్థితిలో థియేటర్స్ తిరిగి తెరవడం కోసం వేచి చూడడం అంటే రిస్క్ తో కూడుకున్న పని.
Video Advertisement
అందుకే ఎన్నో సినిమాలు ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల అవుతున్నాయి. అలా విడుదలైన వాటిలో కృష్ణ అండ్ హిస్ లీల, జోహార్ వంటి సినిమాలు ప్రేక్షకుల మెప్పు పొందాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద హీరోల సినిమాలు కూడా ఓటిటి లో విడుదలకి సిద్ధమవుతున్నాయి.
ఇటీవల సూర్య కూడా తన సినిమా సూరరై పోట్రు అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవ్వనున్నట్టు ప్రకటించారు. ఎంతో కాలం నుండి జరిగిన చర్చ తర్వాత ఇటీవల దిల్ రాజు కూడా తన ప్రొడక్షన్ హౌస్ లో రాబోతున్న నాని 25వ సినిమా వి అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నారు.
అయితే ఇవాళ పది గంటలకి ట్రైలర్ విడుదల చేస్తున్నట్టు నిన్న అంటే ఆగస్టు 24వ తేదీన ప్రకటించారు. జనాలు కూడా పది ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూశారు. కానీ ఎవరైతే ట్రైలర్ చూడాలి అనుకుంటున్నారో వాళ్ళు తమ చేతులతో వి అని చూపిస్తూ అమెజాన్ ప్రైమ్ వెబ్సైట్ లో ఒక పిక్చర్ అప్లోడ్ చేయాలి.
అలా చేసిన వాళ్ళకి మాత్రమే ట్రైలర్ చూసే అవకాశం ఉంటుంది అని వి సినిమా నటులు పోస్ట్ చేశారు. దాంతో అప్పటివరకు యూట్యూబ్ లో వెతికి వెతికి, ట్రైలర్ ఎక్కడ దొరకక, అసలు ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రజలకి నిరాశే ఎదురైంది.
watch trailer:
దాంతో ఏ సోషల్ మీడియాలో అయితే అమెజాన్ ప్రైమ్ ఇలాంటి షరతు పెట్టిందో, అదే సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో ఇలాంటి విచిత్రమైన కండిషన్ పెట్టినందుకు అమెజాన్ ప్రైమ్ కి సమాధానం చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా…ఇన్ని కండిషన్స్ పెట్టి…అంత వెయిట్ చేయించి ఎట్టకేలకు ట్రైలర్ విడుదల చేసారు. ఆ ట్రైలర్ పై కూడా కొన్ని ట్రోల్ల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ లో అదితి రావు ని మిస్ అవుతున్నాము అంటూ సోషల్ మీడియాలో మీమ్ పేజెస్ ట్రోల్ల్స్ చేస్తున్నాయి. అవేంటో ఓ లుక్ వేయండి.
#1.
@2.
#3.
#4.
#5.
#6.
#7.
#8.
#9.
#10.
#11.
#12.
#13.
End of Article