విజయ్ దేవరకొండ, రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. దర్శకుడు మాధవ్ డిఫ్రెంట్ స్టోరీతో వచ్చినప్పటికీ క్లైమాక్స్ లో అదే మూసపద్ధతిలో ఎండ్ పలుకుతాడు. విజయ్, రాశి, ఐశ్వర్య రాజేష్ లు యాక్టింగ్ పరంగా వదిగిపోయారు.

Video Advertisement

ఫస్ట్ ఆఫ్ బాగున్నప్పటికీ సెకండ్ ఆఫ్ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది.సాంగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. దర్శకుడు సెకండ్ ఆఫ్ లో ఎమోషనల్ కాస్త ఎక్కువగా చూపించాలని ప్రయత్నించినప్పటికీ పండించటంలో నటి, నటులు ఫెయిల్ అయ్యారనిచెప్పాలి.ఈ సినిమా చూసిన ఆడియన్స్ మాత్రం పబ్లిక్ టాక్ లో దీనంత చెత్త సినిమా ఇప్పటివరకు చూడలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సహనానికి పరీక్ష పెట్టారు అంటున్నారు. ఇకనైనా విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి ఫీవర్ నుండి బయటకి వచ్చి వేరే జోన్ సినిమాలు చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు.

విజయ్ నటన బాగున్నప్పటికీ సినిమాలో కంటెంట్ లేకపోవడంతో ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. మొత్తం మీద ప్లాప్ అనే చెప్పాలి. మరి ఈ సినిమాని సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోల్ల్స్ చేస్తున్నారో మీరే చూడండి. చూస్తే నవ్వకుండా ఉండలేరు. సినిమా చూడటం కంటే ఈ ట్రోల్ల్స్ చూడటం బెటర్ అనుకుంట.!

watch video: