Ads
బెంగళూరులో ఘోర రోడ్ ప్రమాదం జరిగింది. హసన్ పట్టణం దగ్గరలో శివానంద్, జ్యోతి గత ఆదివారం రోజు రాత్రి ఇంటికి వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన లారీ వారి బైక్ ని ఢీ కొట్టింది.
Video Advertisement
ఈ ప్రమాదంలో శివానంద్ జ్యోతి తో పాటు ఉన్న వారి ఇద్దరు కవల పిల్లలు లారీ చక్రాల కింద నలిగి దాదాపు రెండు కిలోమీటర్లు వరకు వెళ్లి ముక్కలు అయ్యారు. ఆ కవల పిల్లల పేర్లు ప్రణతి, ప్రణవ్. వారికి మూడు సంవత్సరాలు. వారిద్దరూ అక్కడే ప్రాణాలు కోల్పోయారు. జ్యోతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. శివానంద్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డెక్కన్ హెరాల్డ్ కథనం ప్రకారం, అక్కడ ఉన్న స్థానికులు ఆ లారీ డ్రైవర్ ని పట్టుకోడానికి ప్రయత్నించారు. హోసకొప్పలు పట్టణం దగ్గర లారీని ఆపారు. ఆ లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు.
ఈ క్రమంలో అతను మరొక 2 బైక్ లని ఢీ కొట్టాడు. స్థానికులు ఆ డ్రైవర్ ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ద న్యూస్ మినిట్ కథనం ప్రకారం, పోలీసులు మాట్లడుతూ, ఈ ఘటన హాసన్ శివార్ల దగ్గర జరిగింది అని, ఈ బైక్ ని ఢీకొట్టే ముందు ఆ లారీ మరొక నాలుగు వాహనాలను కూడా ఢీకొట్టింది అని తెలిపారు. ఆ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే కారణం అని అంటున్నారు. ప్రస్తుతం పోలీసులు డ్రైవర్ ని విచారిస్తున్నారు.
End of Article