బాహుబలిగా ట్రంప్!!! ఇండియాకి వచ్చేముందు ట్రంప్ షేర్ చేసిన వీడియో ఇది..!

బాహుబలిగా ట్రంప్!!! ఇండియాకి వచ్చేముందు ట్రంప్ షేర్ చేసిన వీడియో ఇది..!

by Megha Varna

Ads

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన గురించి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో మన వాళ్ళను ఆకట్టుకోడానికి ట్రంప్ ఓ పని చేసారు. ఓ ఇండియన్ అభిమాని రూపొందించిన బాహుబలి వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇండియా ఫ్రెండ్స్‌ని కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ట్వీట్‌ ద్వారా తెలిపారు.

Video Advertisement

ఈ నెల 24న భార్య, కూతురు, అల్లుడితో కలిసి భారత్ కి వస్తున్నారు ట్రంప్. ప్రభాస్ ఫేస్‌ను ట్రంప్‌ ముఖంతో మార్చి విభిన్నంగా ఉండే అధ్యక్షుడి హావభావాల్ని సైతం జోడించారు. ఇరు దేశాల సమైక్యత కోసం శత్రువుల్ని చెండాడి ట్రంప్‌ విజయం సాధించినట్లు అందులో చూపించారు. అలాగే చిత్రంలో సామాన్య ప్రజల పిల్లల్ని ప్రభాస్‌ తన భుజాలపై మోస్తూ వారిని ఆశ్చర్యాన్ని గురిచేసే సన్నివేశంలో.. ట్రంప్‌ తన కూతురు ఇవాంకా, కుమారుడు జూనియర్‌ డొనాల్డ్‌ను మోయడం నవ్వులు పూయిస్తోంది. అలాగే శివగామి స్థానంలో ప్రథమ మహిళ మెలనియాను చూపించారు. విజయంతో ట్రంప్ తిరిగొస్తున్నట్టు ఉంది ఆ వీడియో.

అభిమానులు తయారుచేసే వీడియోలపై పెద్దగా స్పందించరు. ఇప్పుడు మాత్రం స్పందించడం, మెచ్చుకోవడం ఆసక్తిగా మారింది. ఇలాంటి ట్వీట్ల ద్వారా.భారతీయులకు దగ్గరయ్యేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియో మొత్తం ‘సాహోరే బాహుబలి’ పాటకి హిందీ వెర్షన్‌ అయిన ‘జీయోరే బాహుబలి’ థీమ్‌సాంగ్‌తో కొనసాగుతుంది. ట్రంప్‌ దీన్ని రీట్వీట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. మూడు గంటల్లో దాదాపు 63వేల మంది లైక్ చేశారు.

ట్విటర్‌లో ఈ వీడియోను ‘సోల్‌’ అనే వ్యక్తి రూపొందించారు. తనకు తాను మీమటేషియన్‌గా, జీఎఫ్‌వై వర్సిటీలో మీమాలజీ ప్రొఫెసర్‌గా చెప్పుకొన్నారు. గతంలో కూడా ట్రంప్‌కు సంబంధించిన కొన్ని వీడియోలను రూపొందించారు సోల్. ఆమె ట్రంప్‌కు అభిమాని అంట.

ఈ ఏడాది చివర్లో అమెరికాలో ఎన్నికలు ఉంటాయి.కాబట్టి వాటిలో భారతీయుల ఓట్లు కొల్లగొట్టేందుకు ట్రంప్ ఇలాంటి వ్యూహాలు రచిస్తున్నారని కొందరు విశ్లేషకులు అంటున్నారు. భారత పర్యటన ద్వారా మరోసారి అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహించేందుకు ట్రంప్ ప్రయతించే ఎత్తులో ఇదొకటి అనుకుంట. ఆ వీడియో మీరే చూడండి.

watch video:


End of Article

You may also like