ట్రంప్ ఉండబోయే హోటల్ ఇదే..! ఒక్క రాత్రికి ఎన్ని లక్షలో తెలుసా?

ట్రంప్ ఉండబోయే హోటల్ ఇదే..! ఒక్క రాత్రికి ఎన్ని లక్షలో తెలుసా?

by Megha Varna

Ads

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సర్వత్రా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తొలిసారి భారత్‌లో పర్యటిస్తున్న ఆయన.. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా మహాత్ముని సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి సందర్శకుల పుస్తకంలో ఆయన ఏం రాశారన్నదానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయఅధ్యక్షుడి సలహాదారు అయిన ఇవాంకాట్రంప్ రంగురంగుల పూల ప్రింట్లతో కూడిన మిడ్డీ డ్రెస్ ధరించి అహ్మదాబాద్ నగరంలో అడుగుపెట్టారు.తన తండ్రితోపాటు యూఎస్ ఎయిర్ ఫోర్స్ ఏ వన్ విమానంలో వచ్చిన ఇవాంకా వెంట ఆమె భర్త జారెడ్ కుష్నర్ కూడా ఉన్నారు.

Video Advertisement

ట్రంప్ ఫామిలీ ఈ రోజు రాత్రి ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లో బస చేస్తారు. ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో ఈ హోటల్ ఉంది. ట్రంప్ అక్కడ బసచేయడంతో బందోబస్తు గట్టిగ ఉంది. గతంలో కూడా పలు ప్రముఖులు ఆ హోటల్ లో బస చేసారు. ట్రంప్ బస చేయనున్న గది హోటల్‌లోని 14వ అంతస్తులో ఉంది. ఈ గది అత్యంత విలాసవంతంగా ఉంటుంది. అన్ని సదుపాయాలు ఉంటాయి ఆ గదిలో. ఇక ఖర్చు విషయానికి వస్తే సామాన్యులు నోరెళ్లబెట్టక తప్పదు అనుకుంట.

ఒక్క రాత్రికి ఈ హోటల్ ఖర్చు రూ.8 లక్షలు అంట. వుడెన్ ఫ్లోరింగ్, గోడలపై అందమైన పెయింటింగ్స్, ఒక పెద్ద లివింగ్ రూమ్, నెమలి ఆకారంలో ఉండే ప్రైవేట్ డైనింగ్ రూమ్, విలాసవంతమైన రెస్ట్ రూమ్‌లతో పాటు రిసెప్షన్ ఏరియా, మిని స్పా, జిమ్‌లు ఉండటం దాని ప్రత్యేకత. ట్రంప్ ఫామిలీ కోసం ఇష్టమైన వంటకాలు ఏంటో అప్పటికప్పుడు తెలుసుకొని వండి వడ్డించనున్నారు అంట. హోటల్ ఐటీసీ మౌర్యలో బస చేయనున్న నాల్గవ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంట.

అంతర్జాతీయ అంశాల్లో మరింత దూసుకెళ్లేందుకు అమెరికా సహకారం భారత్‌కు ప్రయోజనం కలిగించనుంది. వాణిజ్య పరంగా భారత్‌తో మరిన్ని డీల్స్ కుదుర్చుకునేందుకూ ఈ టూర్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. మొదట అహ్మదాబాద్‌లో… ఆ తర్వాత ఆగ్రాలో… చివరిగా ఢిల్లీలో పర్యటించి ఫిబ్రవరి 25న తిరుగుపయనం కానున్నారు. ట్రంప్ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ అధికారికంగా విడుదల చేసారు.


End of Article

You may also like