TSPSC గ్రూప్-1 పరీక్షలు రెండోసారి కూడా ఎందుకు రద్దు చేశారు..? కారణం ఏంటంటే..?

TSPSC గ్రూప్-1 పరీక్షలు రెండోసారి కూడా ఎందుకు రద్దు చేశారు..? కారణం ఏంటంటే..?

by kavitha

Ads

జూన్ 11న నిర్వహించిన టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసి, తిరిగి నిర్వ‌హించాల‌ని కోర్టు టీఎస్పీఎస్సీని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో టీఎస్పీఎస్సీ బోర్డు మీద తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.

Video Advertisement

టీఎస్పీఎస్సీ బోర్డు హైకోర్టు ఇచ్చిన తీర్పు పై డివిజన్‌ బెంచ్‌కు వెళ్తామని ప్రకటించినా కూడా అభ్యర్థులు నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. అయితే తెలంగాణ హైకోర్టు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ను ఎందుకు రద్దు చేసిందో ఇప్పుడు చూద్దాం..
తెలంగాణ రాష్ట్రంలో 503 గ్రూప్‌-1 ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను నిర్వహించిన సంగతి తెల్సిందే. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 కోసం 3 లక్షల 80 వేలమంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో 2,32,457 మంది మాత్రమే ప్రిలిమ్స్‌ పరీక్షకు హాజరయ్యారు. అయితే గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను లీకేజీ వల్ల మొదటిసారి రద్దు చేశారు. ఆ తరువాత జూన్ 11న మళ్ళీ ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను నిర్వహించారు. ఇప్పుడు రెండవ సారి కూడా ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను హైకోర్టు రద్దు చేసింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్ తిరిగి నిర్వ‌హించాల‌ని కోర్టు టీఎస్పీఎస్సీని ఆదేశించింది.
గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణ టైమ్ లో అభ్యర్థులకు బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయకపోవడం వల్లే రద్దు చేస్తున్నట్టుగా కోర్టు తెలిపింది. జూన్ 11న జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్ పరీక్ష సమయంలో బయోమెట్రిక్ అమలు చేయకపోవడం, హాల్‌ టికెట్ నెంబర్  లేని ఓఎంఆర్ షీట్లు ఇవ్వడంతో అక్రమాలకు తావిచ్చేలా ఉందని కొందరు అభ్యర్థులు ఈ విషయం పై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.
ఆ ఎగ్జామ్ ను రద్దు చేసి, మళ్లీ నిర్వహించేలా గవర్నమెంట్ ను, టీఎస్‌పీఎస్సీ బోర్డును ఆదేశించాలని అభ్యర్థులు బి. ప్రశాంత్, జి.హరికృష్ణ, బండి ప్రశాంత్ కోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు, పిటిషనర్ల తరఫున లాయర్ గిరిధర్‌రావు వాదనల అనంతరం, పరీక్షను రద్దు చేస్తూ ఏరోజు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలో అభ్యర్థులు నిరసన తెలుపుతూ రోడ్డెక్కారు. టీఎస్‌పీఎస్సీ బోర్డును రద్దు చేసి, కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని ఆందోళనలు చేస్తున్నారు.

Also Read: కాకినాడ టీచర్ ఘటనలో నిజానికి ఏం జరిగింది..? అసలు ఇందులో తప్పు ఎవరిది..?

 

 


End of Article

You may also like