TSRTC బస్సులు ఈ సమయంలో ఎందుకు అందుబాటులో ఉండవు..? అసలు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు..?

TSRTC బస్సులు ఈ సమయంలో ఎందుకు అందుబాటులో ఉండవు..? అసలు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు..?

by Harika

Ads

ప్రస్తుతం హైదరాబాద్ లో ఎక్కువగా మెట్రోలు వాడుతున్నారు. మెట్రోల వల్ల పనులు సులభం అవుతాయి. వెళ్లే సమయం కూడా తక్కువ అవుతుంది. అందుకే మెట్రో వాడతారు. కానీ ఎన్ని మెట్రోలు వచ్చినా కూడా ఆర్టీసీ బస్సులు వాడే వాళ్ళు ఉంటారు. ఒకవేళ మెట్రో స్టేషన్ కొంచెం దూరంగా ఉండి, బస్ స్టేషన్ వారికి దగ్గరగా ఉంది అంటే, ఆర్టీసీ బస్సులు వాడతారు. అందుకే ఎన్ని మెట్రో వచ్చినా కూడా ఆర్టీసీ బస్సుల సౌలభ్యం మాత్రం అలాగే ఉంది. రెండు నిమిషాలకి ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. అయితే ఇప్పుడు టిఎస్ఆర్టిసి వాళ్లు ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు.

Video Advertisement

uses of free buses in tsrtc

అందుకు కారణం కూడా ఉంది. రేపటి నుండి, అంటే ఏప్రిల్ 17వ తేదీ నుండి కొన్ని బస్సులు కట్ చేయాలి అని నిర్ణయించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తిరిగే బస్సుల్లో కొన్ని బస్సులు అని తగ్గించాలి అని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. ఇందుకు కారణం కూడా ఉంది. మధ్యాహ్నం వేడి మామూలుగా ఉండట్లేదు. అందుకే ప్రజలు మధ్యాహ్నం పూట బయటికి వెళ్లడానికి కూడా సందేహిస్తున్నారు. కాబట్టి అంత వేడిగా ఉండడం కారణంగా ఆ సమయంలో బస్సులు ఎక్కే వారి సంఖ్య తక్కువగా ఉంది. అందుకే బస్సులను కూడా తగ్గించారు. ఉదయం 5 గంటల నుండి మళ్ళీ ఆర్టీసీ బస్సుల సేవలు ప్రారంభం అవుతాయి.

tsrtc new decision

మధ్యాహ్నం 4 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు యధావిధిగానే బస్సులు తిరుగుతాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా బస్సులు అందుబాటులో ఉన్నా కూడా, కొన్ని ప్రాంతాల్లో మాత్రం చాలా తక్కువగా బస్సులు అందుబాటులో ఉంటాయి. గంటకి ఒక బస్సు, లేదా అర్ధ గంటకి ఒక బస్సు వస్తుంది. మధ్యాహ్నం పూట ఆ బస్సులు ఎక్కే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడు బస్సులు తక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పుడు టిఎస్ఆర్టిసి వాళ్ళు తీసుకునే నిర్ణయం ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్నారు. కాబట్టి, అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేలా బస్సు సర్వీసులు అందిస్తారు.

ALSO READ : అప్పట్లో హైదరాబాద్ లో “డబల్ డెక్కర్” బస్సులు ఎందుకు నిలిపివేసారో తెలుసా.? 6 కారణాలు ఇవే.!


End of Article

You may also like