Ads
నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా రిలీజ్ డేట్ ఇవాళ ప్రకటించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 10వ తేదిన విడుదల కాబోతోంది. ఈ సినిమాలో జగపతి బాబు, ఐశ్వర్య రాజేష్, రీతు వర్మ తదితరులు నటించారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహించారు. టక్ జగదీష్ సినిమా మొదట థియేటర్లలో విడుదల అవ్వాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది.
Video Advertisement

అయితే, మొదటి నుంచి కూడా సినిమా బృందం థియేటర్ రిలీజ్ వైపే మొగ్గు చూపింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇది జరిగేలా కనిపించకపోవడంతో అమెజాన్ ప్రైమ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. థియేటర్ రిలీజ్ వైపు ఎంతో ఆసక్తి చూపిన నాని కూడా, సినిమా బృందం ఆలోచనని అర్థం చేసుకొని, నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కానీ తాను సహకరిస్తాను అని ఒక నోట్ కూడా విడుదల చేశారు. దాంతో టక్ జగదీష్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవ్వబోతోంది.
watch video :
End of Article
