Ads
దొంగతనం కూడా 64 కళలలో ఒకటి అని చెప్తూ ఉంటారు.అందుకే చాలామంది దొంగలు మేము ప్లాన్ వేస్తె దొరికేది లేదు అంటూ మంచి కాంఫిడెన్స్ లో ఉంటారు.కానీ చిన్న చిన్న ఆధారాల వలన ఎప్పుడో ఒకప్పుడు దొరికేస్తూ ఉంటారు దొంగలు.అయితే కర్నూల్ లో ఎన్నో దొంగతనాలకు పాల్పడిన ఒక దొంగల ముఠా ఒక టీవీ రిమోట్ వలన దొరికేసారు..ఆ వివరాల్లోకి వెళ్తే ..
Video Advertisement
కర్నూల్ జిల్లా డోన్ లో చాలాకాలంగా వాహనాలు ,విలువైన వస్తువులు,బంగారు ఆభరణాలు వరుసగా చోరీకి గురికాబడుతున్నాయి.కాగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించిన కానీ పోలీసులు ఆ దొంగలను పట్టుకోవడంలో చాలాకాలం నుండి విఫలం అవుతూ వస్తున్నారు.అయితే లాక్ డౌన్ నేపథ్యంలో ఈ దొంగల ముఠా పట్టణంలోని వీణ ఎలక్ట్రానిక్స్ అనే షాపులో భారీ మొత్తంలో టీవీ లు ,హోమ్ థియేటర్ లు ఇంకా కొన్ని విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు చోరీ చేసారు.
అయితే లాక్ డౌన్ వలన వాటిని ఎక్కడికైనా తీసుకువెళ్తే ఇబ్బంది అవుతుంది అని గ్రహించిన దొంగలు వీణ ఎలక్ట్రానిక్స్ ఎదురుగ ఉన్న ఒక ఇంటి వద్దకు వెళ్లి మేము ఈ టీవీ లు ,హోమ్ థియేటర్ లు ఇప్పుడు తీసుకువెళ్తే ఇబ్బంది అవుతుంది లాక్ డౌన్ కదా కాబట్టి మేము కొన్ని రోజుల తర్వాత వచ్చి ఈ వస్తువులను తీసుకెళ్తాము అని చెప్పి ఆ దొంగలు వెళ్లిపోయారు.అయితే లాక్ డౌన్ సడిలింపులు చేసిన ఆ వస్తువులను తీసుకెళ్లడానికి దొంగలు రాకడపోవడంతో ఆ ఇంట్లో ఉన్నవాళ్లు టీవీ ఉపయోగించుకుందాం అని ఆ టీవీ కి సరిపడే రిమోట్ కోసం పట్టణంలోని కొన్ని షాప్స్ కి వెళ్లి ప్రయత్నించారు.
ఇటీవల కాలంలోనే వీణ ఎలక్ట్రానిక్స్ అటువంటి టీవీ చోరీకి గురికావడంతో అనుమానం వచ్చిన షాప్ ఒనేర్ వీణ ఎలక్ట్రానిక్స్ కు సమాచారం అందించాడు.దీంతో వీణ ఎలక్ట్రానిక్స్ మానేజ్మెంట్ వచ్చి అరా తీయగా బుగ్గనపల్లి కి చెందిన విజయుడు ,ఈశ్వరయ్య ,సంతోష్ కుమార్ వచ్చి మా ఇంట్లో టీవీ లు పెట్టి వెళ్లారని చెప్పారు ఆ రిమోట్ కోసం వచ్చినవాళ్లు.అయితే వీణ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో నిందితులను వేంటనే అదుపులోకి తీసుకోని విచారించగా వారు చేసిన అనేక దొంగతనాలు బయటపడ్డాయి.కాగా వారి దగ్గర నుండి పెద్ద మొత్తంలో డబ్బులు ,బంగారం ,వాహనాలను రికవర్ చేసారు పోలీసులు.
End of Article