బుల్లితెరపై వీరి రొమాన్స్ కొద్దిగా శృతిమించుతుందిగా..?

బుల్లితెరపై వీరి రొమాన్స్ కొద్దిగా శృతిమించుతుందిగా..?

by Megha Varna

Ads

హైపర్ ఆది ఈ పేరు చిన్న పెద్ద తేడా లేకుండా యావత్ తెలుగు రాష్ట్రాల్లో అందరికి తెలిసిన పాపులర్ అయిన పేరు..గురు, శుక్రవారాల్లో వచ్చే ‘జబర్దస్త్’ ప్రోగ్రాం ద్వారా పేరు ప్రఖ్యాతలు సాధించిన ఆది.అటు సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. జబర్దస్త్ టీం లో పెళ్లి రూమర్స్ వస్తున్న వాళ్లలో ఒకళ్ళు సుడిగాలి సుధీర్ మరొకరు హైపర్ ఆది.జబర్దస్త్ లో అనసూయ ఆదిల కెమిస్ట్రీ గురించి కొత్తగా చెప్పనవసరంలేదు అనుకుంట. కాకపోతే అది షోలో ఒక భాగమే అని ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరు.

Video Advertisement

అయితే ఢీ డాన్స్ షోలో సుధీర్-రష్మీ జోడి ఒక ఎత్తు అయితే…హైపర్ ఆది వర్షిణి జోడి మరొక ఎత్తు. సుధీర్ రష్మీ జోడి చూసి వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని ఎంతో మంది నెటిజెన్స్ కామెంట్స్ కూడా చేస్తుంటారు. కాకపోతే అది షో వరకే పరిమితం అని పలుసార్లు సుధీర్ రష్మీ చెప్పారు.

తాజాగా వర్షిణి హైపర్ ఆది జోడీపై కూడా ఇలాంటి రూమర్లే వస్తున్నాయి.కానీ అది షో వరకే పరిమితం అని ఇంటర్వ్యూలో పలుసార్లు తెలిపారు హైపర్ ఆది. తాజాగా ఢీ షోలో “నీ కన్ను నీలి సముద్రం” పాటకు వారిద్దరూ చేసిన డాన్స్ ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. వీళ్ళ కెమిస్ట్రీ సుధీర్ – రష్మిని మించిపోతుంది అని కామెంట్స్ చేస్తున్నారు. రొమాన్స్ కొంచెం శృతిమించుతోంది అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు.


End of Article

You may also like