“మల్టీ స్టారర్ అని చెప్పి ఫస్ట్ గ్లింప్స్ లో పవన్ ఒక్కరినే పెట్టారు ఏంటి.?” ట్వీట్ కి ఈ కౌంటర్ హైలైట్.!

“మల్టీ స్టారర్ అని చెప్పి ఫస్ట్ గ్లింప్స్ లో పవన్ ఒక్కరినే పెట్టారు ఏంటి.?” ట్వీట్ కి ఈ కౌంటర్ హైలైట్.!

by Mohana Priya

Ads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న సినిమా టైటిల్ నిన్న విడుదల అయ్యింది. ఈ సినిమా పేరు భీమ్ల నాయక్ అని సినిమా బృందం ప్రకటించింది. ఈ పేరు పవన్ కళ్యాణ్ పోషిస్తున్న పాత్ర పేరు. అయితే, ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమా రీమేక్.

Video Advertisement

మలయాళం టైటిల్ లో హీరోల ఇద్దరు పేర్లు ఉంటాయి. కానీ తెలుగులో మాత్రం పవన్ కళ్యాణ్ ఒక్కరి పేరే ఉంది. అయితే సోషల్ మీడియా అంతటా “ఇది ఏంటి? ఈ సినిమాలో ఇద్దరు హీరోలు కదా? ఇది మల్టీస్టారర్ కదా? మరి టైటిల్ లో కేవలం ఒక్క హీరో పేరు మాత్రమే ఉంది ఏంటి?” అని కామెంట్స్ మొదలయ్యాయి.

ఈ కామెంట్స్ నిర్మాత అయిన సూర్యదేవర నాగ వంశీ వరకు వెళ్లాయి. అందులో ఒక కామెంట్ ఈ విధంగా ఉంది “మల్టీ స్టారర్ సినిమాని సోలో హీరో సినిమాగా మార్చేసారా?” ఇందుకు సూర్యదేవర నాగ వంశీ ఈ విధంగా రిప్లై ఇచ్చారు “దయచేసి వెయిట్ చేయండి. విషయం మొత్తం తెలియకుండానే అప్పుడే నిర్ణయానికి రాకండి. అన్నిటికి ఒక ఆర్డర్ అనేది ఉంది. అదే ఆర్డర్ మేము ఫాలో అవుతున్నాం” అని రిప్లై ఇచ్చారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ ఫస్ట్ గ్లింప్స్ మాత్రం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.


End of Article

You may also like