ప్రతిభ ఉంటే ఎంతటి కష్టాన్ని అయినా అధిగమించవచ్చని కవల ఆడపిల్లలు నిరూపించారు. ప్రస్తుత రోజులలో కూడా బాగా చదువుకొని జాబ్స్ చేసేవారు కొందరు అమ్మాయిల పై వివక్షను చూపిస్తున్నారు.

Video Advertisement

పుట్టిన ఆడపిల్లలను దారుణంగా చూస్తున్నారు. ఓ వ్యక్తి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారని తన వైఫ్ ను పుట్టింట్లోనే  వదిలేశాడు. అయితే ఆమె అక్కడే ఉంటూ తన పిల్లలను చక్కగా చదివించింది. వారిద్దరూ 10 వ తరగతిలో సత్తా చాటారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం..
కవల ఆడపిల్లలు పుట్టారని ఓ తండ్రి భార్యని, పిల్లలను వదిలిపెట్టాడు. దాంతో ఆ ఇద్దరు ఆడ పిల్లలను తాతయ్య, అమ్మమ్మలు చదివించారు. వారి కష్టం వృధా కాలేదు. ఆ ఆడ పిల్లలు బాగా చదువుకుని ఎస్ఎస్సి రిజల్ట్స్ లో 10 జిపిఏ తెచ్చుకున్నారు. కరీంనగర్ జిల్లాలోని  శంకరపట్నం మండలంలోని  కేశవ పట్నం అనే గ్రామానికి చెందిన రిటైర్ ఉద్యోగి అయిన అల్లంకి వీరేశంకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు.
వీరేశం కుమార్తె కవితను పెద్దపల్లి కలెక్టరేట్ లో ఔట్సోర్సింగ్ విభగంలో ఎలక్ట్రానిక్స్ జిల్లా మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు. 16 సంవత్సరాల క్రితం కవితను డెలివరీ కోసం ఏడవ నెలలో భర్త పుట్టింటికి పంపించాడు. అయితే కవితకు కవల ఆడపిల్లలు జన్మించడంతో భర్త ఆమెను పుట్టింట్లోనే వదిలేశాడు.
ఇక అప్పటి నుండి కవితను, ఆమె పిల్లలను అమ్మ వనజ, నాన్న వీరేశం చూసుకుంటున్నారు. ఇద్దరు ఆడపిల్లలు శార్వాణి, ప్రజ్ఞాని 5వ తరగతి వరకు ప్రైవేట్ బడిలో , 6 వ తరగతి నుండి మోడల్ స్కూల్లో చదువును కొనసాగించారు. తాజాగా రిలీజ్ అయిన 10 వ తరగతి ఫలితాల్లో శార్వాణి, ప్రజ్ఞాని 10 జిపిఏ తెచ్చుకుని రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా శార్వాణి, ప్రజ్ఞాని మీడియాతో మాట్లాడుతూ తమ అమ్మమ్మ తాతయ్యలు, తమ స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతి ప్రోత్సాహంతో బాగా చదివి 10 జిపిఏ సాధించగలిగామని వెల్లడించారు.

Also Read: ప్రపంచ దేశాలను చుట్టిరావాలన్నదే ఆమె లక్ష్యం..! 61 సంవత్సరాల వయసులో కూడా.?