బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ భారీ విరాళాన్ని ప్రకటించారు … అయితే అక్షయ్ విరాళానికి సంబందించిన ఓ ముఖ్యమైన విషయాన్నీఆయనభార్య ట్వింకిల్ ఖన్నా బహిర్గతం చేసారు .. వివరాల్లోకి వెళ్తే.

Video Advertisement

అక్షయ్ కుమార్ భారీ విరళంపై అతని భార్య ట్వింకిల్ ఖన్నా మాట్లాడుతూ విరాళం ఇవ్వడానికి వాళ్లద్దరి మధ్య జరిగిన ఒక సంఘటన గురించి వివరించారు . ఇంత పెద్ద మొత్తంలో విరాళం ఇస్తున్నారు మన భవిష్యత్ అవసరాల కోసం డబ్బు అవసరం కదా ….మీరు తీసుకున్న నిర్ణయం సరయినదో కాదో ఒకసారి ఆలోచించుకోమని చెప్పానని తెలిపారు ..

అయితే తన భార్య చెప్పిన మాటలపై స్పందిస్తూ ”నేను నా కెరీర్ ప్రారంభించినప్పుడు నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. ఇప్పుడీ స్థాయిలో ఉన్నా కాబట్టి.. ఇలాంటి పరిస్థితులలో ఏమీ లేని వారి కోసం ఏదైనా సహాయం చేయకుండా ఎలా ఉండగలను” . అయినా నన్ను ఈ స్థాయిలోకి తీసుకువచ్చింది వల్లే వాళ్ళకే తిరిగి ఇస్తున్న అని అన్నారని ట్వింకిల్ ఖన్నా చెప్పారు . అక్షయ్ కుమార్ రీల్ హీరో కాదు గొప్ప మనసున్న రియల్ హీరో అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు .