Karthikeya: కార్తికేయ లవ్ స్టోరీ లో ఇన్ని ట్విస్ట్ లు ఉన్నాయా…?

Karthikeya: కార్తికేయ లవ్ స్టోరీ లో ఇన్ని ట్విస్ట్ లు ఉన్నాయా…?

by Megha Varna

Ads

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో యూత్ కి బాగా దగ్గర అయిపోయాడు కార్తికేయ. ఆ సినిమాతో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కార్తికేయ వరుస సినిమాలతో దూసుకెళ్ళిపోతున్నాడు.

Video Advertisement

ఈ యంగ్ హీరో అతి త్వరలోనే మూడుముళ్ళు వేసి ఓ ఇంటివాడు అవ్వనున్నాడు. అయితే కార్తికేయ ప్రేమకథ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. మరి అవి ఈ ఆర్టికల్ లో చూసేయండి. 2010లో తొలిసారిగా నిట్ వరంగల్లో లోహితను కలిశాడు కార్తికేయ. ఆమెకి తను 2012లో ప్రపోజ్ చేశాడు.

12 Crore At Stake for Karthikeya?

తను ప్రపోజ్ చేసిన సంవత్సరానికి ఆమె ఓకె చెప్పింది. అయితే ఒకసారి బీటెక్ చదువుతున్నప్పుడు లోహిత కార్తికేయకి మెసేజ్ పంపితే దానివల్ల ఇంట్లో గొడవ కూడా జరిగింది. అయితే అది ప్రాంక్ అని చెప్పి తప్పించుకున్నాడు. అప్పుడు మెసేజ్ చేసిన అమ్మాయి లోహితని ఈ మధ్యే కార్తికేయ ఇంట్లో వాళ్లకి చెప్పాడు.

మూడు నెలల క్రితమే కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పాడు కార్తికేయ. అయితే మా స్నేహాన్ని, ప్రేమని ఇంట్లో అర్థం చేసుకొని ఇంట్లో వాళ్ళు అంగీకరించారని కార్తికేయ చెప్పాడు. రాజా విక్రమార్క ప్రీ రిలీజ్ వేడుకలో ఆమెకి ప్రపోజ్ చేసి సర్ప్రైజ్ చేశాడు కార్తికేయ. ఫోన్ లోనే కానీ బయట ఎప్పుడు చెప్పలేదని వేడుకలో చెప్పడం వల్ల జీవితాంతం గుర్తుండిపోతుందని ప్రపోజ్ చేశాడు.


End of Article

You may also like