Ads
తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల ఇద్దరు లెక్చరర్ల మధ్య జరిగిన సంఘర్షణ చర్చలకు దారి తీసింది. సమయం కథనం ప్రకారం అనపర్తి శివారు కొత్తూరులో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇంగ్లీష్ మీడియం గురుకుల జూనియర్ కాలేజ్ లో వెంకటేశ్వరరావు గత ఎనిమిది సంవత్సరాలుగా పార్ట్ టైం లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్నారు.
Video Advertisement
కొంతకాలం క్రితం వెంకటేశ్వరరావుతో పాటు ఇంకొంతమంది పార్ట్ టైం లెక్చరర్లు టెట్ పరీక్షకు హాజరు అవ్వలేదని ఇంఛార్జ్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన తర్వాత ఉన్నతాధికారులు వెంకటేశ్వరరావుతో పాటు మరికొంతమంది లెక్చరర్లను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు.
తర్వాత వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. కాలేజ్ లో జరుగుతున్న విషయాలను వెంకటేశ్వరరావు ఉన్నతాధికారులకు చెప్పడంతో వారు శ్రీనివాసరావు ని వివరణ కోరారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 25 వ తేదీన వారిద్దరూ క్లాస్ రూమ్ లో గొడవ పడ్డారు.
ఈ ఘర్షణలో ఇద్దరికీ గాయాలు అవ్వడంతో తోటి అధ్యాపకులు, విద్యార్థులు వారిద్దరిని విడదీసి అనపర్తి లోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అధికారులు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను విద్యార్థుల నుండి, అధ్యాపకుల నుండి అడిగి తెలుసుకున్నారు.
End of Article