మనం రోజు టీవీలో చూసే సెలబ్రిటీలు నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అలా సెలబ్రిటీస్ రియల్ లైఫ్ ని చూపించిన ప్రోగ్రాం బిగ్ బాస్. హిందీలో చాలా హిట్ అయిన ఈ కార్యక్రమం తెలుగులో ఎలా ఉంటుందో అని మొదట్లో కొంచెం సంకోచం ఉండేది కానీ తెలుగులో కూడా ఊహించని విధంగా స్పందన వచ్చింది.

Video Advertisement

మొదటి సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్, రెండవ సీజన్ లో నాని, మూడవ సీజన్లో నాగార్జున తమ హోస్టింగ్ తో బిగ్ బాస్ షోని జనాలకి ఇంకా చేరువయ్యేలా చేశారు. ఇలా విజయవంతంగా మూడు సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు నాలుగవ సీజన్ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సీజన్ కి కూడా నాగార్జున నే హోస్ట్ గా వ్యవహరిస్తారు అన్న వార్త వినిపిస్తోంది.

జూలై మొదటి వారం లో మొదలవ్వాల్సిన బిగ్ బాస్ సీజన్ ఫోర్ లాక్ డౌన్ కారణంగా ఇంకా మొదలవలేదు. కానీ బిగ్ బాస్ లో వచ్చే కంటెస్టెంట్ ల పేర్లు మాత్రం చాలాచోట్ల వినిపిస్తున్నాయి. లాస్య, శ్రద్ధా దాస్, బిత్తిరి సత్తి, మంగ్లీ ఇలా కొంతమంది పేర్లు బయటికి వచ్చాయి. ఝాన్సీ, అనసూయ మాత్రం బిగ్ బాస్ లోకి వెళ్ళే అవకాశం వచ్చినా కూడా వద్దనుకున్నారు అన్న వార్త కూడా వినిపించింది. ఇప్పుడు అలా బిగ్ బాస్ షో కి వెళ్లడానికి తిరస్కరించిన మరొక ఇద్దరు హీరోల పేర్లు వినబడుతున్నాయి.

వాళ్లలో ఒకరు హీరో కార్తికేయ. ఆర్ఎక్స్ 100 సినిమా తో అడుగు పెట్టి హీరోగానే కాకుండా నాని గ్యాంగ్ లీడర్ సినిమా లో విలన్ గా కూడా కనిపించారు. ప్రస్తుతం తమిళ్ లో అజిత్ హీరోగా నటిస్తున్న సినిమాలు విలన్ పాత్ర పోషిస్తున్నారు. బిగ్ బాస్ యాజమాన్యం షో కి రావడానికి కార్తికేయ ను అడిగితే తిరస్కరించారు అన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

మరొకరు ఆరెంజ్, గుంటూరు టాకీస్, గరుడ వేగ, కల్కి, ఇటీవల వచ్చిన కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాల్లో నటించిన సిద్ధు జొన్నలగడ్డ. సిద్దు కూడా బిగ్ బాస్ షో కి కంటెస్టెంట్ గా వెళ్లడానికి తిరస్కరించారట. ఇదే కాకుండా ఇంకొక వార్త కూడా ప్రచారంలో ఉంది. అదేంటంటే ఈ సారి బిగ్ బాస్ 90 రోజులు ఉండకపోవచ్చట. 50 రోజుల పాటు మాత్రమే షో నిర్వహించాలని బిగ్ బాస్ టీం అనుకుంటున్నారట. బిగ్ బాస్ మొదలయ్యే వరకు ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి.