వైరల్ అవుతున్న “ఉదయ్ కిరణ్” ఓల్డ్ ఇంటర్వ్యూ వీడియో…ఇప్పుడు చూస్తే కన్నీళ్లొస్తున్నాయి.!

వైరల్ అవుతున్న “ఉదయ్ కిరణ్” ఓల్డ్ ఇంటర్వ్యూ వీడియో…ఇప్పుడు చూస్తే కన్నీళ్లొస్తున్నాయి.!

by Mohana Priya

Ads


చిత్రం మనసంతా నువ్వే సినిమాల్లో తన నటన ద్వారా మన అందరికీ చేరువయ్యారు ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ కాలేజ్ లో ఉన్నప్పుడు మోడలింగ్ చేసేవారు. 1999 లో మిస్టీరియస్ గర్ల్ అనే హిందీ సినిమాతో తన కెరీర్ ని మొదలు పెట్టారు ఉదయ్ కిరణ్. తర్వాత తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.

Video Advertisement

ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. తర్వాత వచ్చిన నువ్వు నేను సినిమా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమకథల్లోనే ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. నువ్వు నేను సినిమా కి బెస్ట్ యాక్టర్ గా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నారు ఉదయ్ కిరణ్.

ఆ తర్వాత మనసంతా నువ్వేతో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్నారు. తర్వాత నీకు నేను నాకు నువ్వు, ఔనన్నా కాదన్నా, వియ్యాలవారి కయ్యాలు, కలుసుకోవాలని, శ్రీరామ్, హోలీ, ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు ఉదయ్ కిరణ్. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా మూడు సినిమాల్లో నటించారు. 2014 జనవరి 5వ తేదీన ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారు.

ఉదయ్ కిరణ్ ఆత్మహత్యతో సినీ పరిశ్రమతో పాటు, అభిమానులు కూడా షాక్ కి గురయ్యారు. ఉదయ్ కిరణ్ నటించిన సినిమాల్లో చివరిగా విడుదలైన సినిమా జై శ్రీరామ్. తర్వాత చేసిన చిత్రం చెప్పిన కథ అనే సినిమా విడుదల అవ్వలేదు. జై శ్రీరామ్ సమయంలో ఉదయ్ కిరణ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఈ ఇంటర్వ్యూలో తనని అంతకు ముందు అందరూ క్యూట్ గా చాక్లెట్ బాయ్ లా ఉన్నారని అనేవారు అని, ఇప్పుడు స్మార్ట్ గా అయిన తర్వాత కూడా అలానే అంటున్నారు అని, తనకి అలా అనడం అంత పెద్దగా ఇష్టం ఉండదు అని అన్నారు. ఇంకా చాలా విషయాల గురించి ఉదయ్ కిరణ్ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు ఉదయ్ కిరణ్ మన మధ్య లేరు అనే విషయం గుర్తుకు వచ్చి ఇంకా బాధగా అనిపిస్తుంది.

watch video :

 


End of Article

You may also like