Ads
పెళ్లంటే మూడు ముడులు,ఏడూ అడుగులు తో మొదలయ్యి నేరేళ్ళు హాయిగా సంతోషంగా పిల్ల ,పాపలతో బతకాలని అందరూ ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంటారు.అయితే కొంతమందికి మాత్రం పెళ్లి అయినా కొన్ని రోజులకే అది ఒక చేదు కలగా మిగిలిపోతుంది.అయితే పెళ్లి అయిన మొదటిరోజే భార్యను చంపేసిన ఘటన తమిళనాడు లో వెలుగుచూసింది .వివరాల్లోకి వెళ్తే ..
Video Advertisement
తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలోని సోమంజేరి గ్రామినికి చెందిన నివాసన్..సాధనకుప్పం కు చెందిన సంధ్య ను గత బుధవారం పెళ్లి చేసుకున్నాడు.అయితే పెళ్లి జరుగుతుండగానే వీరిద్దరి మధ్య చిన్నగా వాగ్వాదం జరిగింది.అయితే పెళ్లి తర్వాత బాగానే ఇంటికి వచ్చేసారు.అయితే శోభనానికి కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేసారు.దీంతో శోభనం గదిలోకి వెళ్లిన వదువరులిద్దరు మళ్ళీ వాగ్వాదానికి దిగారు.దీంతో వారిద్దరి మధ్య ఏమైందో ఏమో ఉదయాన్నే గది నుండి ఎవరూ రాలేదు.
కాగా కంగారుపడిన కుటుంబ సభ్యులు డోర్ ఓపెన్ చేసి చూడగా సంధ్య చనిపోయి కనిపడింది.నివాసన్ గురించి వెతకగా ఉరి చివర చెట్టు కు ఉరి వేసుకొని కనిపించాడు.దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.కాగా పోలీసులు మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చెయ్యడం ఆరంభించారు.
End of Article