చదువుతో తన తలరాతను తానే మార్చుకొని తోటి వారందరికీ స్ఫూర్తిని అందించిన ఓ అమ్మాయి కథ ఇది

చదువుతో తన తలరాతను తానే మార్చుకొని తోటి వారందరికీ స్ఫూర్తిని అందించిన ఓ అమ్మాయి కథ ఇది

by Mounika Singaluri

Ads

ప్రతి ఒక్కరికీ ఓ కథ ఉంటుంది. కొన్ని కన్నీళ్లను తెప్పిస్తాయి. మరికొన్ని స్ఫూర్తిని నింపుతాయి.తన తలరాతను తానే మార్చుకొని తోటి వారందరికీ స్ఫూర్తిని అందించిన ఓ అమ్మాయి కథ ఇది.ఆధునిక భారతదేశం ఆవిర్భవించినప్పటి నుండి సమాజంలో స్త్రీలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆ పోరాటంలో తాము విజయం సాధించి తమ తోటి వారందరికీ స్ఫూర్తిని అందించిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి మహిళ శ్రీమతి ఉమా విజయలక్ష్మి. ఒరిస్సాలోని ఒక మారుమూల గిరిజన అమ్మాయి ఉమా. మారుమూల గిరిజన తెగ అవడంవల్ల సాధారణంగానే అక్కడి వారికి ఎవరికీ విద్యపై అవగాహన లేదు. ఆడుతూ పాడుతూ పని చేస్తూనే ఆమె బాల్యం గడిచిపోయింది. ఆమెకు పెళ్లి వయసు వచ్చింది. ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేశారు, కానీ అబ్బాయి గిరిజనుడు అయినప్పటికీ బాగా చదువుకున్నాడు. చదువు సంధ్య నాగరికత తెలియని ఉమా అంటే ఆ అబ్బాయి కి నచ్చేది కాదు. ఆ అమ్మాయిని ఎప్పుడూ అవమానిస్తూ నే ఉండేవాడు ముందుగా నాగరికత గురించి తెలుసుకోమని తరువాత ఆమెను కాపురానికి తీసుకొని వెళ్తాను అని ఆమెను వదిలేసి తను తన ఉద్యోగానికి వెళ్లి పోయాడు. ఆ సమయంలోనే ఆ ఊరికి కొత్తగా వచ్చిన టీచర్ ఆమెకు పరిచయం అయ్యింది, ఆమె కథ మొత్తం విని చదువు మాత్రమే ఆమె సమస్యకి పరిష్కారం అని ఆమెకు తెలియచేసింది.

Video Advertisement

ఉమా మెల్లగా ఆమె దగ్గర చదువు నేర్చుకోవడం ప్రారంభించింది కానీ ఇదంతా నచ్చని ఆమె ఇంట్లో పెద్దలు అంతా కలిసి ఎలా అయినా ఆ అబ్బాయిని ఒప్పించి తన వద్దకు పంపిస్తాను అని చెప్పారు. అప్పటికే చదువు విలువలు అర్థం చేసుకున్నా ఉమా అలా బలవంతంగా ఆ అబ్బాయిని ఒప్పించడం సరైన పద్ధతి కాదు తనకి ఒక అవకాశం ఇవ్వమని తన చదువు వల్ల ఆ అబ్బాయి మారకుంటే అప్పుడే ఇంట్లో వాళ్ళు చెప్పినట్లు వింటానని ఆ అమ్మాయి వారిని ఒప్పించింది. కొన్ని రోజులు గడిచేసరికి ఆ అబ్బాయి ఉమని కాపురానికి తీసుకొని వెళ్ళాడు. కానీ అప్పటి తో ఉమా ప్రయత్నం ఆగలేదు, ఖాళీ సమయాల్లో ప్రభుత్వం వారు కల్పించే అనేక రకమైన అవకాశాల గురించి తెలుసుకొని ప్రభుత్వ పథకాల సహాయంతో వివిధ రకాల పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించింది.

అప్పటివరకు ఇష్టంతోనే ఉన్నా ఉమా భర్త ఆమె సాధించిన విజయాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభ ఉంటుంది కానీ అది వారి చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల ప్రదర్శించ లేకపోవచ్చు అన్న విషయం ఉమా భర్తకి బాగా అర్థం అయ్యింది. ఆ రోజు నుండి ఉమని చులకనగా చూడడం మానేసి ప్రేమగా ఉండడం ప్రారంభించాడు. జరిగింది ఏది అయినా అంతా మన మంచికే తన భర్త ప్రవర్తన వల్లే తనకంటూ ఒక గుర్తింపును సాధించగలిగాను అని కూడా ఆనందంగా ఉంది.సమాజంలో సమస్యలను ధైర్యంగా ఎదురించిన ఈ అమ్మాయి గురించి అందరికి తెలిసేలా చేయండి ,ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపండి ,మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి .


End of Article

You may also like