తెలిసి తెలియక తీసుకునే నిర్ణయాలు చివరికి మన ప్రాణాల మీదికి తెస్తాయి. అయితే ప్రస్తుత సమాజంలో టెక్నాలజీ పెరిగి అన్నీ అందుబాటులోకి వచ్చాయి కాబట్టి ఆలోచన శక్తి తగ్గుతోంది. పూర్వకాలంలో ఏదైనా ప్రాక్టికల్ గా చేసేవారు. అలా చేయడం వల్ల ఆ పని గురించి వారికి అర్థం అయ్యేది. తెలివి పెరిగేది. వారు ఏదైనా చేయాలంటే ఆలోచించేవారు. కానీ ప్రస్తుత కాలంలో కొంతమంది పిల్లలు మానసిక ఒత్తిళ్లకు గురై చిన్నతనంలోనే ప్రేమ వ్యవహారాల వైపు వెళ్తున్నారు.

Video Advertisement

చిన్న చిన్న కారణాలతోనే ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. కానీ బీహార్ రాష్ట్రంలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన చూసి అందరూ షాక్ కి గురయ్యారు. పిల్లలు ఇంత పని చేశారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఏం జరిగిందో చూద్దామా..?ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ సమీపాన కాస్మా అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి చెందినటువంటి ఆరుగురు బాలికలు ప్రాణ స్నేహితులు. వారు ఏ పని చేసిన కలిసి చేసేవారు. ఏ సమస్యనైనా షేర్ చేసుకొని చెప్పుకునేవారు.

representative image

ఈ సందర్భంలోనే శుక్రవారం ఈ బాలికలు అందరూ కలిసి చెరువుగట్టుకు వెళ్లారు. వారి మధ్య ఏం జరిగిందో ఏమో అందరూ విషం తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. ఇదంతా గమనించిన స్థానికులు చికిత్సకోసం వారిని ఆస్పత్రికి తరలించారు. కానీ అంతలోనే అందులో ముగ్గురు బాలికలు మృతి చెందారు. మిగిలిన వారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టడంతో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఆ బాలికల్లో ఒక అమ్మాయి ఒక వ్యక్తిని ప్రేమిస్తోందట.

అయితే అతను బాలికను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో ఆ బాలిక మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలిసింది. కానీ అందులో మిగతా ఐదుగురు బాలికలు మాత్రం ఈ విషాన్ని ఎందుకు తాగారు అనేది తెలియలేదు. మిగిలిన ఆ ఐదుగురు బాలికలకు కూడా ప్రేమ వ్యవహారంతో ఏవైనా సంబంధాలు ఉన్నాయా .. లేక మరేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఏది ఏమైనా ఆరుగురు బాలికలు ఒకేసారి ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి అని చెప్పవచ్చు.